వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎయిర్ పోర్టులో ప్రయాణికులు

ఈ వారం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ఈ కొత్త వేరియంట్‌ను B.1.1.529 అని పిలుస్తున్నారు.

ఇది మునుపటి వాటికన్నా చాలా ఎక్కువగా ఉత్పరివర్తనం చెందింది. ఇది "చాలా భయంకరమైనదని" శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత దారుణమైందని అంటున్నారు.

దాంతో పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ సరిహద్దులను మూసేస్తున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా, దాని చుట్టుపక్కలున్న దేశాల నుంచి విమానాల రాకపోకలపై బ్రిటన్, సింగపూర్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, మొజాంబిక్ తాత్కాలికంగా నిషేధం విధించాయి.

ఏఏ దేశాల నుంచి రాకపోకలు ఆపేస్తున్నారు?

  • దక్షిణాఫ్రికా
  • బోత్స్‌వానా
  • నమీబియా
  • జింబాబ్వే
  • ఎస్వతిని (పూర్వం స్వాజీలాండ్)
  • లెసొతొ

ఈ దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేయాలని యురోపియన్ యూనియన్ కూడా భావిస్తోంది.

ఈ దేశాల్లో 12 గంటలకు పైగా గడిపిన వారిని తమ దేశంలోకి అడుగుపెట్టకుండా చూడాలని చెక్ రిపబ్లిక్ భావిస్తోంది.

ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ ఎదుర్కొంటున్న జర్మనీ శుక్రవారం రాత్రి వరకూ ఈ దేశాల్లోని జర్మన్లను మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. అయితే, వీళ్లంతా 14 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికా, బోత్స్‌వానా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణీకులకు పక్కాగా పరీక్షలు చేయాలని భారతదేశం అధికారులను ఆదేశించింది.

ఈ వేరియంట్ గురించి తెలిసింది తక్కువే..

ఈ కొత్త వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఈ వేరియంట్‌పై వారు ఆందోళన వ్యకర్తం చేస్తున్నారు.

కొత్త వేరియంట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.

ఈ వేరియంట్ అత్యధికంగా ఉత్పరివర్తనం (మ్యూటేషన్) చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు దానిపై ప్రభావం చూపలేకపోవచ్చు.

ఎందుకంటే ఇప్పుడున్న వ్యాక్సీన్లు వూహాన్‌కు చెందిన ఒరిజినల్ స్ట్రెయిన్ ఆధారంగా తయారు చేసినవి. కానీ ఈ కొత్త వేరియంట్ చాలా ఎక్కువగా ఉత్పరివర్తనం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ వేరియంట్‌కు ఇంకా పేరు పెట్టలేదు. దీన్ని ప్రస్తుతం B.1.1.529 అని పిలుస్తున్నారు. వచ్చే శుక్రవారం దీనికొక పేరు పెట్టే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఇప్పటి వరకు ఏ ఏ దేశాలకు వ్యాపించింది?

ఇప్పటి వరకు వందకంటే తక్కువ శాంపిల్సే వచ్చాయని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కేసులు ప్రధానంగా దక్షిణాఫ్రికాలోనే బయటపడ్డాయని వెల్లడించింది.

అయితే, హాంకాంగ్, ఇజ్రాయెల్, బోత్స్వానాలో కూడా ఈ వేరియంట్ సోకిందని తెలిపింది.

ఈ వేరియంట్ ఇతర దేశాలకు వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ చెప్పారు.

దక్షిణాఫ్రికాలో కేవలం 24శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు. దాంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సైంటిఫిక్ పాండమిక్ ఇన్‌ఫ్లూయెంజా మోడలింగ్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ మైక్ బీబీసీతో చెప్పారు.

హాంకాంగ్‌లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి, హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న సమయంలో ఈ వేరియంట్ వ్యాపించింది. ఆయనతో పాటు అదే హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న మరోవ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లు కొన్ని రోజుల తర్వాత బయటపడిందని హాంకాంగ్‌ వైద్యాధికారులు తెలిపారు. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ వాళ్లద్దరికీ ఈ కొత్త వేరియంట్ సోకిందని వివరించారు.

కొత్త వేరియంట్‌కు సంబంధించి ఇదొక అత్యవసర పరిస్థితి అని ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. వేగంగా, పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

మలావీ నుంచి తిరిగొచ్చిన ఒక వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్ బయటపడిందని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. మరో రెండు అనుమానాస్పద కేసుల్లో పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. హాంకాంగ్‌లో మాదిరిగానే ఈ ముగ్గురు కూడా రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నారు. అయినా వారికి కొత్త వేరియంట్ సోకింది.

కొత్త వేరియంట్ వ్యాపించకుండా దేశాలు ఏం చేస్తున్నాయి?

తొందరపాటుగా ప్రయాణ ఆంక్షలు విధించొద్దని, రిస్క్ ఆధారంగా, శాస్త్రీయ పద్ధతులు పాటించాలని డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది.

డబ్ల్యూహెచ్‌ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ.. దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులను బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్ నిలిపేశాయి.

దక్షిణాఫ్రికా, బోత్స్వానా, నమీబియా, జింబాబ్వేల నుంచి విమాన రాకపోకలను ఆపేశాయి.

పైన చెప్పిన దేశాలతో పాటు మెజాంబిక్‌ను కూడా తమ ట్రావెల్ బ్యాన్ జాబితాలో చేర్చాయి సింగపూర్, ఇటలీ, ఇజ్రాయెల్.

ఆ ప్రాంతం నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను అత్యవసరంగా ఆపేయాలని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లేయన్ ప్రతిపాదించారు.

https://twitter.com/vonderleyen/status/1464132568333398018

ఇక డెల్టా వేరియంట్ కారణంగా జర్మనీలో ఇప్పుడు కరోనావైరస్ నాలుగో వేవ్ నడుస్తోంది. కొత్త వేరియంట్ బయటపడిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఉన్న జర్మన్లను మాత్రమే శుక్రవారం నుంచి తమ దేశంలోకి రానిస్తామని జర్మనీ చెప్పినట్లు ఆరోగ్య శాఖ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

అయితే, స్వదేశానికి వచ్చే వారు రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ.. 14రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు.

దక్షిణాఫ్రికా స్పందన

విమాన రాకపోకలపై బ్రిటన్‌ నిషేధం విధిచడాన్ని దక్షిణాఫ్రికా విమర్శించింది. ఇది తొందరపాటు నిర్ణయమని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.

తమ దేశ పౌరుల రక్షణకు పలు దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే హక్కును గౌరవిస్తాం. కానీ డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి చర్యలకు సిఫార్సు చేయకముందే దక్షిణాఫ్రికన్లు రాకుండా బ్రిటన్‌ తాత్కాలిక ట్రావెల్ బ్యాన్ విధించడం తొందరపాటు చర్యగానే అనిపిస్తోందని దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona South Africa variant: countries closing borders .. restrictions on air travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X