వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్లకు గుడ్‌న్యూస్: ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్: ఓటింగ్: నిపుణులు ఓకే: వారంలో

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్‌ వినియోగించే దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా చేరింది. ఇప్పటికే బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి పచ్చజెండా ఊపాయి. ఇక అమెరికాలో త్వరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సాధారణ ప్రజల వినియోగానికి వీలుగా ఫైజర్ వ్యాక్సిన్ తొలిదశ అడ్డంకిని అధిగమించింది. ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎఫ్‌డీఏ)కు చెందిన నిపుణుల ప్యానెల్ ఈ మేరకు అనుమతులను జారీ చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంపై నిర్వహించిన ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ ఓట్లు వినియోగం వైపే పడ్డాయి.

ఇక అక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్: సాధారణ ప్రజల వినియోగానికి: బ్రిటన్ తరువాత రెండో దేశంఇక అక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్: సాధారణ ప్రజల వినియోగానికి: బ్రిటన్ తరువాత రెండో దేశం

అమెరికాకే చెందిన ఫైజర్..

అమెరికాకే చెందిన ఫైజర్..

ప్రపంచంలో కరోనా వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనతను అందుకుంది ఫైజర్ కంపెనీ. అమెరికాకే చెందిన ఈ ఫార్మూసూటికల్స్ సంస్థ.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇదివరకే భారత్ సహా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్ సహా అనేక దేశాల్లో దశలవారీగా క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రయోగాల దశలో వచ్చిన ఫలితాలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను ఫైజర్ కంపెనీ ప్రతినిధులు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ కంపెనీకి పంపించారు.

మెజారిటీ ఓట్లు..

మెజారిటీ ఓట్లు..

ఫైజర్ వ్యాక్సిన్‌ను వినియోగించాలా? వద్దా? అనే అంశంపై ఎఫ్‌డీఏ నిపుణులతో కూడిన ప్యానెల్ ప్రత్యేకంగా ఓటింగ్ చేపట్టింది. మొత్తం 22 మంది ప్యానెల్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వినియోగానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా నాలుగు ఓట్లు పోల్ అయ్యాయి. ఒక ఓటును పరిశీలనలో ఉంచారు. భారీ మెజారిటీతోో ఎఫ్‌డీఏ ప్యానెల్ వ్యాక్సిన్ వినియోగానికి తన అంగీకారాన్ని వ్యక్తం చేయడంతో..తొలిదశ అడ్డంకిని అధిగమించినట్టయింది. ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఈ ప్రతిపాదనలను అక్కడి హెల్త్ రెగ్యులేటరీ, మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది.

వారం రోజుల్లో పూర్తిస్థాయి అనుమతులు..

వారం రోజుల్లో పూర్తిస్థాయి అనుమతులు..

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వినియోగానికి వారం రోజుల్లో అనుమతి ఇచ్చేలా చర్యలను తీసుకుంటామని అమెరికా వైద్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ తెలిపారు. వ్యాక్సిన్ ట్రాన్స్‌పోర్టేషన్‌, స్టోరేజీ కోసం అవసరమైన రూట్ మ్యాప్, బ్లూప్రింట్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ను అమెరికన్లకు అందజేస్తామని చెప్పారు. అత్యవసరం కింద వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చిందని, వెంటనే దీన్ని వినియోగంలోకి తీసుకుని రాకపోతే.. పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

Recommended Video

Basavatarakam Cancer Hospital Awarded as 6th Best Cancer Hospital in India : Balakrishna
ఒకే రోజు మూడువేల మంది మరణం..

ఒకే రోజు మూడువేల మంది మరణం..

అలెక్స్ అజర్ ఆందోళనను వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. అమెరికాలో కరోనా వైరస్ తన కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒకేరోజు మూడువేల మంది కరోనా బారిన పడి మరణించారు. మొత్తం మరణాలు మూడు లక్షలకు చేరువ అయ్యాయి. కోటి 60 లక్షల మందికి పైగా అమెరికన్లకు ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకింది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఫైజర్ వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకుని రావాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రతిపాదనలపై తొలిదశ ఆమోదాన్ని తెలిపింది. మిగిలిన అనుమతులు వారం రోజుల్లో లభించే అవకాశం ఉందని అలెక్స్ పేర్కొన్నారు.

English summary
A United States government advisory panel has endorsed the Pfizer-BioNTech COVID-19 vaccine, a critical step towards the vaccine’s final approval for eventual distribution across the country. FDA voted 17-4 in favour of the vaccine, with one abstention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X