అమెరికాలో కల్లోలం.. రాజధాని మూసివేత.. చిక్కుకుపోయిన భారతీయులకు గుడ్ న్యూన్..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్త్ లాక్‌డౌన్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతకీ అంగీకరించకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశరాజధాని వాషింగ్టన్ డీసీ(కొలంబియా డిస్ట్రిక్ట్) మూసివేతకు మేయర్ మురెయిల్ బౌజర్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. డీసీలో ఎక్కడా 10 మందికి మించి గుమ్మికూడొద్దని, సినిమా థియేటర్లు, బట్టల దుకాణాలు, నైట్ క్లబ్బులు, జిమ్, స్పా తదితర సముదాయాలను తక్షణం మూసేయాలని ఆమె ఆదేశాలిచ్చారు. నిత్యావసరాలు, అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు.

మరణమృదంగం..
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకూ విస్తరించిన కరోనా మహమ్మారి భయానకంగా జూలు విదుల్చుతున్నది. బుధవారం రాత్రి నాటికి దేశవ్యాప్తంగా వైరస్ కాటుకు 1,032 మంది ప్రాణాలు కోల్పోగా, పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 70 వేలకు చేరువైంది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 200 మంది చనిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. దేశరాజధాని వాషింగ్టన్ డీసీ, ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూయార్క్ తోపాటు పలు రాష్ట్రాల షడ్ డౌన్ కు ఆయా స్థానిక ప్రభుత్వాలు ఇదివరకే ఆదేశాలిచ్చాయి. అయితే పూర్తి స్థాయి లాక్ డౌన్ కు మాత్రం ప్రెసిడెంట్ ట్రంప్ నో చెబుతున్నారు.

ట్రంప్ ఉద్దీపనలు..
‘వైరస్ కారణంగా చాలా మంది చనిపోతారు, కానీ లాక్ డౌన్ వల్ల ఏర్పడే ఆర్థిక మాంద్యంతో ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటారు' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని బిల్ గేట్స్ సహా ప్రముఖులంతా తప్పుపట్టారు. కాగా, కరోనా కారణంగా దెబ్బతిన్న పౌరుల్ని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రెసిడెంట్ భారీ తాయిలాలు ప్రకటించారు. మొత్తం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన ఆయన.. 75 వేల డాలర్ల లోపు ఆదాయం ఉన్న ప్రతి పౌరుడి ఖాతాలో 1200 డాలర్లు జమచేయనున్నట్లు చెప్పారు. అలాగే, 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు, పిల్లలు ఒక్కొక్కరికి 500 డాలర్లు అందిస్తామని చెప్పారు. అయితే..

రోడ్డున పడ్డ భారతీయ విద్యార్థులు..
కరోనా విలయంతో దేశవ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుండటం వలసదారులు, విదేశీ విద్యార్థుల పాటిలి శాపంగా మారిది. ప్రధానంగా అమెరికాలో చదువుకుంటోన్న సుమారు 2.5లక్షల మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పూర్తిగా నిలుపుదల చేయడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. వైరస్ వ్యాప్తి భయాలతో స్థానిక ప్రభుత్వాలు.. అన్ని చోట్లా హాస్టళ్లను ఖాళీ చేయిస్తుండటంతో మన విద్యార్థులు రోడ్డునపడ్డట్లయింది..
Recommended Video

ఆదుకున్న తొటిదేశస్తులు..
భారతీయ విద్యార్థుల ఇబ్బందులు చూసి భారతసంతతి వ్యాపారవేత్తలు చలించిపోయారు. అమెరికాలో హోటల్ వ్యాపారాలు సాగిస్తోన్న ఇండియన్-అమెరికన్లు.. మన విద్యార్థులకు వసతి కల్పించేందుకు ముందుకొచ్చారు. వివిధ యూనివర్సిటీల్లో చదువుతూ, హాస్టళ్ల నుంచి ఖాళీ చేసిన విద్యార్థులంతా తమ హోటళ్లలో ఉండొచ్చని, అందరికీ ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని ఇండియన్-అమెరికన్ హోటలీర్స్ ప్రకటించారు. సాయం చేసేందుకు ముందుకు రావాలంటూ ఇండియన్ ఎంబసీ ఇచ్చిన పిలుపు మేరకు హోటల్ వ్యాపారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు 700 హోటళ్లలో 6వేల గదుల్ని విద్యార్థుల కోసం సిద్ధం చేసినట్లు చెప్పారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications