కరోనా చివరి మహమ్మారి కాదు -రాబోయే రోజుల్లోనూ సంక్షోభాలు తప్పవు: WHO చీఫ్ హెచ్చరిక
కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. పర్యావరణంలో చోటుచేసుకుంటోన్న అనూహ్య మార్పులను నివారించలేకపోతే రాబోయే రోజుల్లో విపత్తులు తప్పవని, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు చేపడుతోన్న ప్రయత్నాలకు ఇబ్బందులు తప్పబోవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ అన్నారు.
కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ట్రెడోస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు. పాలకులకు దూరదృష్టి లేకపోవడం ప్రపంచానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ
కరోనా లాంటి విపత్తులు తలెత్తిన సమయంలో ప్రభుత్వాలు అప్పటికప్పుడూ పరిష్కాల కోసం వెతుకులాడకుండా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కోరారు. కరోనా సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇలాంటి ఉపద్రవాలు మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య అంతర్లీనంగా పెనవేసుకున్న బంధాన్ని గుర్తుచేస్తాయని వివరించారు. ఈ బంధం దెబ్బతిన్న కొద్దీ ప్రమాదానికి మరింత చేరువవుతామని హెచ్చరించారు. భూగ్రహంపై నివసించడానికి ఉన్న అనుకూలతలకు ముప్పు వాటిల్లే కొద్దీ అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. వాతావరణ మార్పులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'సంక్షోభం సమయాల్లో గాబరా పడటం..పరిస్థితి కుదుటపడ్డాక నిర్లక్ష్యం ప్రదర్శించడటం..గత కొంత కాలం ప్రపంచం మొత్తం ఇదే వైఖరిని అవలంబిస్తోంది. సమస్య తలెత్తినప్పుడల్లా డబ్బు వెదజల్లి పరిష్కరిస్తాం.. ఆ తరువాత పాత ఘటనలను మర్చిపోతాం. మరో సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఏ ప్రయత్నాలూ చేయం. ఇటువంటి వైఖరి చాలా ప్రమాదకరం. ఇలా ఎందుకు జరగుతోందో అర్థం కావట్లేదు. అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. గత సంవత్సర కాలంలో కరోనా మహమ్మారితో యావత్తు ప్రపంచం తలకిందులైందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం ఒక్క మానన ఆరోగ్యానికి పరిమితం కాలేదని.. సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు.
జడ్జిలపై జగన్ పార్టీ మరో పిడుగు -అమ్మకానికి హైకోర్టు తీర్పులు -భారీ అవినీతి -ఎంఎస్ బాబు సంచలనం
'కరోనానే చివరి సంక్షోభం కాదని చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి మహమ్మారులు మన జీవితంలో ఓ భాగం. మావనువులు, జంతువులు, భూమి బాగోగుల మధ్యలోని సంబంధాన్ని కరోనా సుస్పష్టం చేసింది. పర్యావరణ మార్పులను అడ్డుకోని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేసే ప్రయత్నాలన్నీ ఇబ్బందులకు గురవుతాయి. భూమిపై బతికేందుకు వీలులేకుండా చేస్తున్న పర్యావరణ మార్పులు..మానవాళి మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్నాయి'' అని టెడ్రోస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిదికోట్ల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 17.5లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.