వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు మరో మహమ్మారి ముప్పు: కరోనాకు తోడైతే అగ్రరాజ్యానికి చాలా చాలా కష్టం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనావైరస్ ఇప్పుడు ఈ పేరు వింటేనే అమెరికన్లు హడలిపోతున్నారు. ఎందుకంటే, కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ప్రాణనష్టం అమెరికాలోనే జరిగింది. ఇప్పటికే అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,60, 603కు చేరింది. ఇందులో 79,486 మంది కోలుకోగా, 48, 201 మంది మరణించారు.

మరోసారి అమెరికాపై ప్రకోపం..

మరోసారి అమెరికాపై ప్రకోపం..

ఈ నేపథ్యంలో అమెరికా వైద్యారోగ్య అధిపతి చెప్పిన మాటలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా 50వేల మందిని కోల్పోయిన అమెరికాపై మరోసారి కరోనా తన ప్రకోపాన్ని చూపనుందని చెప్పారు. వచ్చేది ఫ్లూ సీజన్ కావడంతో కరోనా ప్రభావం మరింతగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వచ్చే సీజన్లో..

వచ్చే సీజన్లో..

వచ్చే ఫ్లూ సీజన్‌కు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనిడైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డీసెజెస్ కంట్రోల్ ఫర్ ప్రివెంన్షన్((సీడీసీ) రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఈ మేరకు అమెరికాను హెచ్చరించారు. వచ్చేది చలి కాలం కావడంతో కరోనావైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని, ఈ మహ్మారిని కట్టడి చేయడం మరింత కష్టంగా మారనుందని అన్నారు.

ఫ్లూతోనూ భారీ నష్టమే..

ఫ్లూతోనూ భారీ నష్టమే..

ఇప్పుడు అమెరికా ఒకేసారి ఫ్లూ మహమ్మారి, కరోనా మహమ్మారి రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి ఉంటుందని రాబర్ట్ తెలిపారు. 2019లోనే హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ మహమ్మారి పెను విషాదాన్ని మిగిల్చిందని, మార్చి-జూన్ తర్వాత సెప్టెంబర్-డిసెంబర్ రెండోసారి కూడా ఫ్లూ సీజన్ కావడంతో భారీగా నష్టం జరిగిందని తెలిపారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases
రెండూ కలిస్తే అగ్ర రాజ్యానికి చాలా చాలా కష్టం..

రెండూ కలిస్తే అగ్ర రాజ్యానికి చాలా చాలా కష్టం..

అమెరికాలో కరోనా విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ ఫ్లూ సమయంలోనే వచ్చిన కరోనావైరస్.. అమెరికా ఆరోగ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాబర్ట్ తెలిపారు. కరోనావైరస్, ఫ్లూ రెండూ ఒకేసారి దాడి చేస్తే మాత్రం అమెరికాకు ఆ రెంండింటినీ ఎదుర్కోవడం చాలా చాలా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 26,65,122 కాగా, 7,27,170 మంది కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 1,85,494.

English summary
A second wave of the novel coronavirus in the United States could be even more destructive because it will likely collide with the beginning of flu season, one of the country's top health officials have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X