వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కెనడా సరిహద్దు గుండా బలగాల మొహరింపు, వైరస్ నేపథ్యంలో అమెరికా నిర్ణయం..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాపై అధికంగా ప్రభావం చూపుతోంది. వెయ్యి మందికి పైగా వైరస్ సోకి చనిపోగా.. వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కెనడా సరిహద్దు నుంచి చొరబాటుదారులు వచ్చే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. సాధారణంగా కాకుండా.. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో అమెరికా మరింత భయపడుతోంది.

 Coronavirus: Trump looking to put troops near Canadian border..

అమెరికా అధ్యక్ష అధికార కార్యాలయం వైట్ హౌస్‌లో బలగాల మొహరింపుపై గురువారం డిస్కష్ చేసినట్టు 'గ్లోబల్ న్యూస్' తన కథనంలో పేర్కొన్నది. కానీ ప్రతీ ఏటా కొందరు అమెరికా సరిహద్దు దాటి వస్తుంటారు. అక్రమంగా దేశంలోకి చొరబడుతారని అమెరికా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కెనడా సరిహద్దులో బలగాల మొహరింపునకు సంబంధించి ఇప్పటికీ అధికార నిర్ణయం తీసుకోలేదని.. వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

అమెరికా సరిహద్దులో బలగాల మొహరింపునకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుందని కెనడా ప్రభుత్వం కూడా అనుమానిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద సరిహద్దు కలిగిన రెండు దేశాలు కలిగి ఉన్నాయని, అది అలాగే కలిగి ఉంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఆయన రెడొ కాటెజ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరోవైపు అమెరికా తీసుకోబోతున్న చర్యను కెనడా డిప్యూటీ ప్రధానమంత్రి ఖండించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

English summary
American government officials inside Donald Trump’s White House are actively discussing putting troops near the Canadian borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X