వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఆస్పత్రులుగా భవనాలు, న్యూయార్క్‌లో 10 వేల పడకలు..? 4 వారాల్లో ..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో కూడా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను గుర్తించడంలో చైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్‌ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకొంటుంది. వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో భారీ భవనాలను ఆస్పత్రులు మార్చబోతున్నామని అమెరికా మిలిటరీ ప్రకటించింది.

న్యూయార్క్‌లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ భవనాలను ఆస్పత్రులుగా మార్చడంతో 10 వేల పడకల హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి. న్యూయార్క్ సహా ఇతరచోట్ల భవన సముదాయాలను ఆస్పత్రులుగా మార్చడానికి 4 వారాల సమయం పడుతోందని అమెరికా ఆర్మీ కార్ప్స్ ఇంజినీర్ అధిపతి లెప్టినెంట్ టాట్ సెమోనైట్ పెంటగాన్‌లో మీడియాకు తెలిపారు. పాజిటివ్ సోకిన వారిని క్వారంటైన్‌లో ఉంచడం గానీ, ఐసోలేసన్ వార్డు కోసం సదుపాయాలు గల ఆస్పత్రులు తప్పనిసరి అని తెలిసిందే.

coronavirus: US military says it is working to convert buildings into hospitals

హోటళ్లు, కాలేజీ హాస్టళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లను ఆస్పత్రులుగా మారుస్తామని తెలిపారు. వాటిని ఐసీయూ కేంద్రాలుగా మార్చి.. పాజిటివ్ సోకిన వారికి... వైరస్ తీవ్రంగా ఉన్నవారికి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. అమెరికాలో శుక్రవారం నాటికి 7 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది చనిపోయారు. న్యూయార్క్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భయాందోళన నెలకొంది.

English summary
US military said it is working to convert buildings into hospitals and could potentially provide 10,000 hospital beds in New York, as the coronavirus pandemic escalates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X