వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ వ్యాక్సీన్లు: కొత్త వేరియంట్లపై పని చేస్తాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా వైరస్

బ్రిటన్‌లో నాలుగు కొత్త రకం బ్రెజిల్‌ కరోనా వైరస్‌ వేరియంట్లను నిపుణులు గుర్తించారు. దీంతో ఆ దేశంలో ఈ వేరియంట్ సోకిన కేసుల సంఖ్య 10కి చేరింది. వైరస్ సోకిన వ్యక్తి ఇటీవల బ్రెజిల్ నుంచి యూకె వెళ్లడంతో ఈ వైరస్ బయటపడింది.

ఇలాంటి వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా ఇవి సోకితే వ్యాక్సీన్‌లు కూడా సరిగ్గా పని చేయవేమోననే భయం కూడా ఉంది.

ఈ కొత్త వేరియంట్లు ఏమిటి?

కొత్తగా కొన్ని వేల రకాల కోవిడ్‌ వైరస్‌ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. బ్రెజిల్‌ వేరియంట్ కాకుండా పి1 అనే కొత్త వేరియంట్‌ వైరస్‌లను కూడా గుర్తించారు. యూకే వేరియంట్‌ లేదా కెంట్‌ వేరియంట్‌గా పిలిచే (B.1.3.5.1.) రకం వైరస్‌ ప్రస్తుతం బ్రిటన్లో ఎక్కువగా ఉంది.

ఈ వైరస్‌ ఇప్పటికే 50 దేశాలకు వ్యాపించి మరింత పరివర్తన చెందుతున్నట్లు కనిపిస్తోంది. దక్షిణ ఆఫ్రికా వేరియంట్ (B.1.3.5.1.) యూకే సహా మరో 20 దేశాలలో కనిపించింది. అయితే, కొత్త వేరియంట్‌లు పుట్టుకు రావడం ఊహించని విషయమేమి కాదని నిపుణులు చెబుతున్నారు.

వ్యాప్తి చెందడానికి వైరస్‌లు పరివర్తన చెందుతూ తమ నమూనాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే వీటి లక్షణాలు కొన్ని అనూహ్యంగా ఉన్నాయి. అయితే, ఈ వైరస్ కొత్త వేరియంట్లు సోకిన వారిలో ఎక్కువమంది తీవ్రంగా జబ్బు పడినట్లు ఆధారాలు లేవు.

కరోనావైరస్

అయితే, ఈ వైరస్‌ వేరియంట్లు సోకిన వృద్ధులకు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువగా ఉంది. యూకే వేరియంట్‌తో మరణించే అవకాశాలు 30శాతం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు.

చేతులు శుభ్రపర్చుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ వేసుకోవడంలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొత్త వేరియంట్లు పాత వాటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపించడంతో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం.

యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ మూడు వేరియంట్‌లలో శరీరంలోని కణాలకు అతుక్కునే స్పైక్ ప్రోటీన్‌లో చాలా మార్పులు జరిగాయి. దీంతో ఇన్ఫెక్షన్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.

సెప్టెంబరులో కనిపించిన యూకే, కెంట్ స్ట్రెయిన్ 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. ఈ వ్యాప్తి చెందే గుణం 30-50 శాతం ఉంటుందని ఇంగ్లాండ్ పబ్లిక్‌ హెల్త్‌ నిర్వహించిన పరిశోధన చెబుతోంది.

అక్టోబరులో సౌత్‌ ఆఫ్రికా వేరియంట్ కనిపించింది. ఈ స్పైక్ ప్రోటీన్‌లో ప్రముఖమైన మార్పులు కనిపించాయి. ఆందోళన కలిగించే మార్పులతో యూకే వేరియంట్‌తో కొన్ని కేసులు వచ్చినట్లు నిపుణులు తెలిపారు.

అందులో కీలకమైన E484K అనే మ్యుటేషన్ ఉంది. ఇది వైరస్‌తో పోరాడగలిగే రోగ నిరోధక శక్తి, యాంటీ బాడీల మీద దాడి చేస్తుంది. జూలైలో కనిపించిన బ్రెజిల్ వేరియంట్‌లో కూడా E484K మ్యూటేషన్ కూడా ఉంది.

కరోనా వైరస్

వ్యాక్సీన్లు ఇంకా పని చేస్తాయా?

మొదటిసారి వెలుగు చూసిన కరోనావైరస్ వేరియంట్‌కు అనుగుణంగా ప్రస్తుతం వ్యాక్సీన్ల తయారీ జరిగింది. కానీ, పూర్తిగా కాకపోయినా ఈ టీకాలు కొంత వరకు పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతంలో ఒకసారి వైరస్ సోకిన వారిలో తయారయిన యాంటీబాడీలపై కూడా బ్రెజిల్ వేరియంట్ దాడి చేస్తోంది. కానీ, ఈ కొత్త వేరియంట్‌లపై ఫైజర్‌ వ్యాక్సీన్ బాగా పని చేస్తోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్‌ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది.

త్వరలో ఆమోదం పొందనున్న నోవావాక్స్ , జాన్సన్ అండ్‌ జాన్సన్‌ తయారు చేసిన వ్యాక్సీన్లు కొంత వరకు ఈ కొత్త వేరియంట్‌లకు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.

కొత్తగా వచ్చిన యూకే వేరియంట్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ రక్షణ కల్పిస్తుందని ఆ వ్యాక్సీన్‌ తయార బృందం విడుదల చేసిన సమాచారంలో ఉంది. అయితే ఇది సౌతాఫ్రికా వేరియంట్‌కి పని చేయడం లేదు.

కానీ, ఇది తీవ్రమైన అనారోగ్యం నుంచి కొంత వరకు రక్షిస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ వేరియంట్ కి మోడెర్నా వ్యాక్సీన్‌ పని చేయవచ్చని కొన్ని ఫలితాలు చెబుతున్నాయి. అయితే, ఇది దీర్ఘకాలికంగా పని చేయకపోవచ్చు.

ప్రస్తుతం ఉన్న వేరియంట్‌లకు భిన్నంగా ఉండే వేరియంట్‌లు కూడా భవిష్యత్తులో తలెత్తవచ్చు. అయితే, వాటి పై పోరాడేందుకు కొన్ని వారాల్లో లేదంటే నెలల్లో వ్యాక్సీన్‌ను కొంత వరకు మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫ్లూ వైరస్‌లో వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి ప్రతి సంవత్సరం కొత్తగా టీకాలో మార్పులు చేసినట్లే కరోనా వైరస్ విషయంలో కూడా జరగవచ్చు.

కరోనా వైరస్

ఏమి చేయవచ్చు?

మరిన్ని కొత్త వేరియంట్లు రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వీటి పై దృష్టి పెట్టి, ముఖ్యమైన వాటిపై అధ్యయనం చేస్తున్నారు. నిపుణులు కరోనావైరస్ వ్యాక్సీన్‌లను అప్‌డేట్ కూడా చేస్తున్నారు.

భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్‌లకు వ్యాక్సీన్‌లు తయారు చేసేందుకు బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ క్యూర్‌ వేక్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. వీటి కోసం ఇప్పటికే 5 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus vaccines: Will they work on newer variants?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X