వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగార ఔషధంతో కరోనాకు చెక్: విరుగుడుగా పనిచేస్తోన్న అంగస్తంభన మందు, 4 రోజుల్లోనే...

|
Google Oneindia TeluguNews

కరోనా.. కరోనా.. కరోనా... పేరు చెబితే చాలు ఒళ్లు గగుర్పొడిచాల్సిందే. వైరస్ ఆవిర్భావంపై స్పష్టత లేకపోవడంతో వ్యాక్సిన్ తయారీ కోసం దేశాలు/ ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వ్యాక్సీన్ వచ్చే అవకాశం ఉంది. అయితే శాస్త్రవేత్తలు మరో గుడ్ న్యూస్ చెప్పారు. అంగస్తంభన సమస్యల కోసం వాడే ఆర్ఎల్ఎఫ్-100 కరోనాను నివారిస్తోందనే విషయం చెప్పారు. దీనిని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పరీక్షిస్తామని పేర్కొన్నారు. దీంతో కరోనాను సమూలంగా కట్టడి చేసేందుకు మరో ఔషధం కూడా ఉపయోగించొచ్చు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరిపిన తర్వాతే.. నిర్ధారించే అవకాశం ఉంది.

 మూడు వారాల్లోనే 10 లక్షల కొత్త కరోనా కేసులు: 20 లక్షలకు చేరిక, ఐనా దేశం కోలుకుంటోంది! మూడు వారాల్లోనే 10 లక్షల కొత్త కరోనా కేసులు: 20 లక్షలకు చేరిక, ఐనా దేశం కోలుకుంటోంది!

అంగస్తంభన మందు.. కరోనాకు విరుగుడు...

అంగస్తంభన మందు.. కరోనాకు విరుగుడు...

ఆర్ఎల్‌ఎఫ్-100: అంగస్తంభన సమస్యల నివారణ కోసం వాడుతుంటారు. దీనికి అవిప్టడిల్ అనే మరో పేరు కూడా ఉంది. ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. కరోనా వైరస్‌తో బాధపడే రోగులపై ప్రయోగ జరిపేందుకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. దీంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రయోగాలను నిర్వహిస్తారు. మందును కరోనా రోగులకు అందించేందుకు జూన్ నెలలో అనుమతులు ఇచ్చినా.. అదీ కాస్త సెప్టెంబర్ వరకు పెరిగింది.

సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగం..

సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగం..

ఆర్ఎల్‌ఎఫ్-100 మందుకు స్విట్జర్లాండ్ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌ కంపెనీ పెటెంట్ కలిగి ఉంది. ఇజ్రాయెల్-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి కరోనా రోగులపై ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిని ఇదివరకు తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి అందజేశారు. అయితే అతను వేగంగా కోలుకోవడంతో ఇతరులపై ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నది. అతనికి ఊపిరితిత్తుల సమస్య ఉండగా.. ఇతర వ్యాధి ఉన్నవారిపై కూడా ప్రయోగాలు జరిపి.. ఫలితాలను వెల్లడిస్తామని చెబుతోంది.

4 రోజుల్లోనే కోలుకోవడంతో...

4 రోజుల్లోనే కోలుకోవడంతో...

54 ఏళ్ల వ్యక్తికి లాంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే అతనికి ఆ సందర్బంలో వైరస్‌ అంటుకుంది. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అతనికి ఆర్ఎల్‌ఎఫ్-100 మందు ఇచ్చారు. దీంతో అతను నాలుగు రోజుల్లోనే వెంటిలేటర్‌పై నుంచి బయటికొచ్చారు. అతనిలా ఇతరులు కూడా వేగంగా కోలుకునేందుకు ఆర్ఎల్‌ఎఫ్-100 పనిచేసింది. దీంతో మరి కొందరిపై ప్రయోగాలు చేయాలని నిర్ణయం తీసుకొని.. ముందడుగు వేశారు. ప్రయోగ ఫలితాలు అనుకూలంగా వస్తే.. వేగంగా కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉంది.

Recommended Video

FlipKart Big Saving Days 2020 ,అదిరిపోయే డిస్కౌంట్లు!! || Oneindia Telugu
నివారించడంలో కీ రోల్..

నివారించడంలో కీ రోల్..

కరోనా సోకిన వారిని సైటోకైన్‌ స్టార్మ్‌ ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే ఆర్ఎల్‌ఎఫ్-100 వాడితే ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో వైరస్‌ సంఖ్య పెరగకుండా నిరోధిస్తోంది. దీంతో వైరస్ నుంచి వేగంగా కోలుకోవచ్చని తెలిపారు. దానిపై శాస్త్రీయే పరీక్షలు చేశాక.. అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పరీక్షల్లో అన్నీ ఓకే అయితే.. కరోనా నివారణకు మంచి మందు దొరికినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

English summary
coronavirus will destroy RLF-100: scientists starts Experiment in medicine september-1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X