COVID : కోవిడ్‌తో 15 ఏళ్ల బాలిక గొంతుపోయింది...
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే విఛ్చినం చేసింది. ఎన్నో దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. దేశంలో చాలామంది ఈ మహామ్మారి కారణంగా చనిపోయారు. కరోనా వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా చాలామంది దాని ప్రభావంతో వచ్చే సమస్యలతో బాధ పడుతూనే ఉన్నారు.అయితే, కరోనా వచ్చి కోలుకున్నా కానీ, దాని ప్రభావంతో వచ్చే వ్యాధులు దీర్ఘకాలికంగా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగుచూసింది.
కరోనా సోకిన ఓ పదిహేనేళ్ల బాలికకు గొంతుపోయింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఈ ఘటన జరిగింది. కోవిడ్ కారణంగా ఓ 15ఏళ్ల బాలికకు మాట పడిపోయింది. ఆమె పూర్తిగా మాట్లడలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్ 2 వైరస్, మానవుల నాడీ మండలాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శమని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మసాచుసెట్స్‌కు చెందిన ఓ పదిహేనేళ్ల బాలికకు గతంలో కరోనా వైరస్ వచ్చింది. అయితే కొన్ని రోజులపాటు ఇంట్లోనే చికిత్స తీసుకుంది. అయినా ఆ బాలిక పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఇంకా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ బాలిక తీవ్ర శ్వాస కోశ సమస్యలతో ఇబ్బంది పడింది. 13 వారాల అనంతరం ఓ ఆసుపత్రిలో చేరింది.

13నెలల పాటు గొంతులో గొట్టం ద్వారా శ్వాస తీసుకున్న బాలిక : బాలికను పరీక్షించిన వైద్యులు ఓ సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఆ టెస్టుల్లో బాలిక స్వరపేటికలోని రెండు స్వర తంత్రులూ పూర్తిగా స్తంభించిపోయాయని, ఆ బాలికకు గొంతు సంబంధ పక్షవాతం వచ్చిందని వైద్యుల నిర్దారణలో తేలింది. ఈ సంఘటన వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆ బాలిక గొంతుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. గొంతుకు రంధ్రాన్నిచేశారు. ఆ బాలిక ఊపిరి పీల్చుకునేందుకు ఆ రంధ్రానికి ఒక గొట్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా గొంతులో గొట్టం ద్వారా ఆ బాలిక శ్వాస తీసుకోంటుంది. ఈ పరిస్థితి 13 నెలలపాటు కొనసాగిందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications