• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గాలి ద్వారా వ్యాపించే వ్యాధికి సుపరిచిత ఉదాహరణ క్షయ

కరోనా ఉన్నవారు దగ్గడం, తుమ్మడం వల్ల బయటికొచ్చిన కోవిడ్-19 బిందువులు పడిన ఉపరితలాలను తాకడం ద్వారానే కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నెలలుగా చెబుతూ వస్తోంది.

కరోనావైరస్ దగ్గు ద్వారా గాని, తుమ్ము ద్వారా గాని వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పింది.

అందుకే, దాని వ్యాప్తిని నివారించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం కీలక నివారణ చర్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సూచించారు.

కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కొట్టిపారేయలేం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.

అంటే, మాట్లాడేటప్పుడు గాని, ఊపిరి తీసుకునేటప్పుడు గాని గాలిలోకి విడుదలయ్యే చిన్న చిన్న కణాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందవచ్చు.

ఇది ఆధారాలతో సహా నిరూపితమైతే, ఇంటా బయటా మనుషులు పాటించాల్సిన నియమావళిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

పీపీఈలో మెడికల్ వర్కర్

గాలి ద్వారా వ్యాప్తి చెందడం అంటే ఏమిటి?

గాలిలో కొన్ని గంటల పాటు తిరిగే కణాలకు అంటిపెట్టుకుని ఉండే వైరస్ లేదా బ్యాక్టీరియా మనషులు శ్వాసించినప్పుడు లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించడాన్ని గాలి ద్వారా వ్యాప్తి అని అంటాం.

ఈ సూక్ష్మ కణాలు చాలా దూరం విస్తరించే అవకాశం ఉంటుంది.

క్షయ, ఫ్లూ, న్యూమోనియా లాంటి రోగాలను గాలి ద్వారా వ్యాపించే రోగాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

కిక్కిరిసిన ప్రాంతాల్లో, లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే విషయాన్ని నిర్ధరించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.

గాలిలో ఈ వైరస్ ఎంత సేపు మనుగడ సాగిస్తుంది?

కృత్రిమంగా స్ప్రే చేసిన కరోనావైరస్ గాలిలో కనీసం మూడు గంటల పాటు సజీవంగా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి.

అయితే, ఈ ప్రయోగాలను ప్రయోగశాలల్లో నిర్వహించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగ శాలల్లో ఉండే పరిస్థితులకు, నిజ జీవితం లో ఉండే పరిస్థితులకు తేడా ఉండటంతో ఫలితాలలో తేడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

'సూపర్ స్ప్రెడింగ్’ ద్వారా వ్యాప్తి చెందిన కరోనా కేసులు, కరోనావైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందగలదనే అనుమానాలను బలపరిచాయి.

వాషింగ్టన్ లోని మౌంట్ వెర్నన్ నగరంలో, కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తి ద్వారా కనీసం 45 మందికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. ఆయన ఒక సంగీత కార్యక్రమంలో అందరితో కలిసి పాల్గొన్నారు.

ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కొంత మంది సామాజిక దూరాన్ని పాటించాలనే నియమాలను కూడా ఉల్లఘించలేదు.

చైనాలోని గువాంగ్ ఝౌ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వైరస్ సోకిన ఒక వ్యక్తి ద్వారా అదే రెస్టారంట్లో తింటున్న మరో 9 మందికి వైరస్ వ్యాపించింది.

వైరస్ సోకిన వ్యక్తి కరోనావైరస్ ఉన్న వ్యక్తి నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

అమెరికాలోని ఒక చర్చి

ఇప్పుడు నేనేం చేయాలి?

ఒక రోగం ఎలా వ్యాప్తి చెందుతుందో అనే అంశాన్ని బట్టి దాని నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలను నిర్ణయిస్తారు.

కరోనా వ్యాప్తిని నివారించడానికి చేతులు వేడి నీటితో 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు, భౌతిక దూరం పాటించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

అయితే, కరోనావైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా ఆపడానికి ఈ నివారణ చర్యలు సరిపోవని కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే అంశం నిర్ధరణ అయితే మాస్క్ లను ఎక్కువగా వాడమనే సలహా చేయవచ్చు. అంతే కాకుండా ముఖ్యంగా బార్లు, రెస్టారెంట్లు, ప్రజారవాణా వాహనాలలో మరింతఎక్కువగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.

ఎయిర్ కండిషన్డ్ పరిసరాలను కూడా మరింత నియంత్రించే అవకాశం ఉంది.

ఎయిర్ కండిషనర్లు

WHO నియమావళిని మార్చవలసిన అవసరం ఎందుకు వస్తోంది?

ఇటీవల 32 దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక బహిరంగ లేఖ రాశారు.

కరోనావైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ కోవిడ్ నియమావళిని సవరించాలని కోరారు.

“వారు ఆధారాలను గుర్తించాలని మేం కోరుతున్నాం” అని శాస్త్రవేత్తలు రాసిన లేఖలో సంతకం చేసిన కోలరాడో యూనివర్సిటీ కెమిస్ట్ జోస్ జిమెంజ్ రాయిటర్స్ ‌కు చెప్పారు.

ఇది కచ్చితంగా డబ్ల్యుహెచ్ఓ మీద దాడి కాదు. ఇది ఒక శాస్త్రీయ చర్చ. కానీ, ఆధారాలు ఉన్నాయని చాలాసార్లు చెప్పినా, వారు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో, మేం బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది” అని ఆయన చెప్పారు.

“జనం కిక్కిరిసిన, మూసి ఉన్న ప్రాంతాల్లో, తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని తోసిపుచ్చలేం అనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి” అని డబ్ల్యుహెచ్ఓ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అల్లెగ్రాంజీ చెప్పారు.

ఈ ఆధారాలు ప్రాథమికం, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడానికి ముందు దీనిని మరింత నిర్థరించడం అవసరం అని డబ్ల్యుహెచ్ఓ అధికారులు అంటున్నారు.

"ఆధారాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది. దీనిని ధ్రువీకరిస్తే, వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవచ్చు అనే సలహాలను కూడా మార్చాల్సి ఉంటుంది, అని ప్రపంచ ఆరోగ్య సంస్థలో సలహాదారునిగా పని చేస్తున్న డాక్టర్ డేవిడ్ హేమన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus spreads in the air according to scientists
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X