వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్: ఇండియాలో కరోనా బాధితుల సహాయానికి ముందుకొస్తున్న బ్రిటన్‌లోని భారతీయులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తోటి భారతీయుల కోసం బ్రిటన్లోని ఒక దేవాలయంలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న బ్రిటన్లో భారత సంతతి

దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క విలవిలలాడడం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని కలచివేసింది. ప్రధానంగా విదేశాల్లో ఉండే భారతీయులను మరింతగా కదిలించింది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్‌లోని కొన్ని భారతీయ సమాజాలు పలు విధాలుగా స్పందిస్తున్నాయి.

వాయువ్య లండన్‌లోని వెంబ్లీలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో కొంత మంది భారత సంతతి ప్రజలు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న తమ దేశ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తున్నారు.

ప్రార్థనలు మాత్రమే కాకుండా భారతదేశంలో బాధితులకు సహాయం చేసేందుకు చాలా మంది బ్రిటిష్ ఇండియన్లు పలు సహాయ కార్యక్రమాలకూ ముందుకొస్తున్నారు.

"భారత్‌లో నెలకొన్న పరిస్థితికి చలించని ఒక్క ఇండియన్ కూడా ఇక్కడ లేరు" అని బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ చైర్మన్ మనోజ్ బదలే చెప్పారు.

"భారతదేశంలో నాకు చాలా మంది బంధువులు, కుటుంబీకులు ఉన్నారు. మేం చాలా వేదనభరితమైన కథనాలు వింటున్నాం. గత వారంలోనే ఈ పరిస్థితి తీవ్రం కావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది" అని ఆయన అన్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు సహకారం అందించే ఈ ట్రస్ట్ ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరత పరిష్కారంపై దృష్టి పెట్టింది.

ఈ ట్రస్ట్ చేసిన అత్యవసర అభ్యర్థనకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కూడా మద్దతు తెలిపారు.

మహమ్మారి సమయంలో భారత్ ఇతర దేశాలకు చాలా సహాయం అందించందంటూ, ఇప్పుడు మనం భారత్‌కి సహాయం చేయాలని అన్నారు. ట్రస్ట్ చేపట్టిన ఆక్సిజన్ ఫర్ ఇండియా ప్రచారానికి వ్యక్తిగత విరాళం కూడా ఇచ్చారు.

ఈ అభ్యర్థన ద్వారా ఇప్పటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు కొనేందుకు కొన్ని వేల పౌండ్లను సేకరించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు రోగులకు చికిత్స చేసేందుకు వీటి ద్వారా గాలిలోంచి నేరుగా ఆక్సిజన్ అందించవచ్చు.

ఇలా సహాయ చర్యలు చేపడుతున్న వాటిలో ఈ ట్రస్ట్ ఒక్కటి మాత్రమే కాదు. బ్రిటిష్ భారతీయలు నిర్వహించిన మరో క్యాంపెయిన్ 'గో ఫండ్ మి’ కూడా అనుకున్న లక్ష్యాన్ని దాటి ఒక్క రోజులోనే 16,00,000 పౌండ్లను(సుమారు రూ. 16.5 కోట్లు) సేకరించింది. దీంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు.

తోటి భారతీయుల కోసం బ్రిటన్లోని ఒక దేవాలయంలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న బ్రిటన్లో భారత సంతతి

సంక్షోభ సమయాల్లో బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ దక్షిణ ఆసియా దేశాలకు 14 ఏళ్లుగా సహాయం అందిస్తూనే ఉందని బదలే అన్నారు.

"మాకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారిలో బ్రిటిష్ వారు ఎక్కువగా ఉన్నారు" అని ఆయన చెప్పారు.

యూకెలో ఉన్న వైద్య రంగంలోని వారు కూడా ఇతర విధానాల ద్వారా తమ వంతు సహాయం అందిస్తున్నారు.

బ్రిస్టల్‌లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్‌గా ఉన్న అమర్ దీప్ దస్తిదార్ ఆయన పని వేళల తర్వాత వారాంతాల్లోనూ, ఇండియాలోనూ రోగులకు ఫోను ద్వారా టెలిమెడికల్ కన్సల్టేషన్ అందిస్తున్నారు.

"ఏ అంటువ్యాధైనా రెండో వేవ్‌లో తీవ్రంగానే ఉంటుంద"ని ఆయన అన్నారు.

"నాకు కోవిడ్ సోకింది. మా సోదరుడికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ఆయన ఏడు రోజులు ఐసీయూలో ఉన్నారు. చాలా సవాళ్లతో కూడిన సమయం"

"నేను స్నేహితులు, బంధువుల ద్వారా కోవిడ్ గురించి వివిధ భాషల్లోకి తర్జుమా చేసి అవగాహన కల్పిస్తూ సహాయం చేస్తున్నాను."

"అందరూ సహనాన్ని కోల్పోతున్నారు. అందరికీ సహకారం అవసరమే" అని దస్తీదార్ అన్నారు.

దస్తీదార్ తరహాలోనే ఫోన్ల ద్వారా వైద్య సలహాలు అందించేందుకు భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ డాక్టర్ల సంఘం బాపియో కూడా పని చేస్తోంది.

భారత దేశంలో నెలకొన్న సంక్షోభం చూసి బ్రిట‌న్‌లోని భారతీయులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారని శ్రీ వల్లభ్ నిధి దేవాలయం చైర్మన్ నరేంద్ర థక్రార్ చెప్పారు.

"అందరికీ అక్కడ బంధువులు ఉన్నారు. కొందరు ఇండియా వెళ్లాలని అనుకున్నారు. కానీ, వారు వారి బంధువులను చూడలేకపోయారు. కొందరు వారి బంధువుల దహన సంస్కారాలకు కూడా హాజరు కాలేకపోతున్నారు" అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కొందరు ఆక్సిజన్ పరికరాల కోసం నిధులు సమకూరుస్తున్నారు.. మరికొందరు భారత్‌లో పరిస్థితులు చక్కబడాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

"ఈ విశ్వం కోసం, ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇది వసుధైక కుటుంబం" అని దేవాలయ పురోహితుడు భవిక్ పాండ్య అన్నారు.

ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది భయపడుతున్నారు. " మేము మా మాతృ భూమిని రక్షించమని ప్రార్థిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: Indians in Britain reaching out to help corona victims in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X