వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌పై అనుమానాలు... పారదర్శకత లోపించిందా...?

|
Google Oneindia TeluguNews

గతేడాది క్లినికల్ ట్రయల్స్ దశలో టీకా ప్రయోగాల్లో తప్పు దొర్లిందని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటే ఆ తర్వాత తమ విన్నింగ్ ఫార్ములాగా మారిందని... రెండు డోసుల విధానంలో తమ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది. అయితే ఈ పొరపాటు గురించి తమ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌లో ఎక్కడా పేర్కొనలేదు. పైగా ఈ విషయాన్ని ఆ వాలంటీర్లకు కూడా తెలియపరచలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ దీన్ని బయటపెట్టింది.క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో పాల్గొన్న తొలి 1500 మంది వాలంటీర్లకు ఇలా తప్పుడు డోసు ఇచ్చినట్లు తేలింది.

రాయిటర్స్ కథనం ప్రకారం... జరిగిన తప్పును బ్రిటీష్ మెడికల్ రెగ్యులేటర్స్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొనకపోగా... ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తెలివిగా దాన్ని కవర్ చేసుకుంది. జూన్ 8న రాసిన లేఖలో... వ్యాక్సిన్‌ను వివిధ డోసుల్లో వాలంటీర్లకు ఇవ్వడం ద్వారా అది ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఒక అవకాశం ఏర్పడిందని తెలిపింది. ఆ లేఖపై క్లినికల్ ట్రయల్స్ చీఫ్ ఇన్వెస్టిగేటర్,ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ ఆండ్రూ జె.పొలార్డ్ సంతకం చేసి ట్రయల్ సబ్జెక్టుకు పంపించారు.

Covid vaccine dosing error in clinical trails but volunteers werent informed

కొలతకు సంబంధించిన తప్పిదం కారణంగా వాలంటీర్లకు సగం డోసు మాత్రమే ఇచ్చినట్లు గతేడాది డిసెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని బ్రిటీష్ మెడికల్ రెగ్యులేటర్స్‌కు పంపించిన రిపోర్టుల్లో ఎక్కడా పేర్కొనలేదు. ఈ తప్పిదం కారణంగా వాలంటీర్ల ఆరోగ్యం రిస్క్‌లో పడుతుందా అన్న దానిపై ఎక్కడా ఏ ప్రస్తావన లేదు. ప్రస్తుతం యూకె,భారత్ సహా పలు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి వాడుతున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 90శాతం సమర్థవంతంగా పనిచేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అయితే క్లినికల్ ట్రయల్స్‌లో జరిగిన తప్పిదాన్ని ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా మెడికల్ రెగ్యులేటరీ సంస్థకు నివేదించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీన్నిబట్టి అసలు ఆ సంస్థ సమర్పించిన డేటాను ఎంతవరకు విశ్వసించవచ్చు... లేదా ఆ సంస్థ జరిపిన ప్రయోగాలు పారదర్శకంగా జరిగాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

#TelanganaSchools : Schools For Classes 9 & 10 To Reopen From 1 Feb

దుర్హమ్ యూనివర్సిటీ లా స్కూల్‌కి చెందిన హెల్త్ కేర్ లా ప్రొఫెసర్ ఎమ్మా కేవ్ మాట్లాడుతూ... జరిగిన తప్పిదాన్ని ఒక ప్లాన్డ్ వ్యవహారం లాగా క్లినికల్ ట్రయల్స్ డాక్యుమెంట్స్‌లో చూపించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇది మొత్తం పరిశోధన పట్ల విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

English summary
About 1,500 of the initial volunteers in a late-stage clinical trial of the Oxford/AstraZeneca Covid-19 vaccine were given the wrong dose, but weren't informed that a mistake had been made after the blunder was discovered, documents obtained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X