3,500అడుగుల ఎత్తు గాజు వంతెనకి పగుళ్లు, పరుగు
బీజింగ్: చైనాలోని గాజు వంతెనకు పగుళ్లు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. హెనన్ ప్రావిన్స్‌లో గాజుతో తయారు చేసిన వంతెనను నిర్మించారు. యున్‌టయ్ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగులో యూ ఆకారంలో, సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఈ వంతెను నిర్మించారు.
ఒక్కో పొర 27 మిల్లీ మీటర్ల మందంతో, మూడు పొరలతో దీన్ని నిర్మించారు. ప్రత్యేక టెక్నాలజీ ఆధారంగా ఎంతటి బరువునైనా ఆపగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వంతెన మీద అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి.

గత సోమవారం పర్యాటకులు వెళ్తుండగా ఓ మహిళ చేతిలో నుంచి స్టీల్ కప్ జారి వంతెనపై పడింది. దీంతో వంతెన పైపొరపై చిన్న పగుళ్లు వచ్చాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అక్కడక్కడా పగుళ్లు కనబడటంతో పర్యాటకులు పరుగు తీశారు.
అధికారులు స్పందిస్తూ.. అవి చిన్న పగుళ్లేనని, వాటి వల్ల వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. వంతెనను తాత్కాలికంగా మూసివేశామని, మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత తిరిగి తెరుస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications