అమెరికా- ఇరాన్ చర్చలు.. భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు..!
అమెరికా- ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినట్లు స్పష్టం అవుతోంది. అలాగే అమెరికా సుంకాలపై నెలకొన్న అనిశ్చితి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి ఓ కారణం అని చెప్పొచ్చు. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఈ చర్చలు సఫలీకృతం అయినా లేక ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగి ఇరాన్ పై ఆంక్షలు తొలగితే.. అంతర్జాతీయ మార్కెట్ లోకి ఇరాన్ చమురు సరఫరా భారీగా పెరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
అమెరికా- ఇరాన్ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ (WTI) ధరలు కూడా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 76 సెంట్లు తగ్గి 71.03 కు చేరగా WTI క్రూడ్ 75 సెంట్లు తగ్గి 65.75 డాలర్లకు చేరినట్లు సమాచారం. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ టారిఫ్స్ ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచడం కూడా క్రూడ్ ఆయిల్ డిమాండ్ పై ప్రభావం చూపించింది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అమెరికా- ఇరాన్ మధ్య చర్చలపై ఒమన్ విదేశాంగ మంత్రి అల్బుసైదీ కీలక విషయాలను వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా- ఇరాన్ మధ్య ఈ వారాంతంలో జెనీవాలో మూడో రౌండ్ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. మరోవైపు..పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ఎదుర్కోడానికి అమెరికా, ఇరాన్ రెండు దేశాలు తమ సైన్యాలను సిద్ధంగా ఉంచినట్లు అల్బుసైదీ స్పష్టం చేశారు.

అలాగే ప్రస్తుతం అమెరికాలో టారిఫ్ లపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడం చట్టరిత్యా వ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫిబ్రవరి 24 మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు అధిక టారిఫ్ ల వసూలు ఫిబ్రవరి 24 నుంచి ఆగిపోనున్నాయి. ఇక ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ట్రంప్ వరుసగా 10 శాతం, ఆ తర్వాత 15 శాతం టారిఫ్ లు పెంచిన విషయం తెలిసిందే.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
చమురు వేట: రంగంలోకి ONGC, కృష్ణ-గోదావరి నుంచి అండమాన్ వరకు..












Click it and Unblock the Notifications