ఉత్తరకొరియాపై దాడికి.. దేవుడి అనుమతి! ఇక ట్రంప్ దే ఆలస్యమన్న పాస్టర్!?

ఉత్తర కొరియాపై అమెరికా దాడికి భగవంతుడి అనుమతి కూడా లభించిందట. ఇక ట్రంప్ దే ఆలస్యమట. ఈ విషయాన్ని స్వయంగా ఓ మత బోధకుడు వెల్లడించడం అమెరికాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వాషింగ్టన్: ఉత్తర కొరియాపై అమెరికా దాడికి భగవంతుడి అనుమతి కూడా లభించిందట. ఇక ట్రంప్ దే ఆలస్యమట. ఈ విషయాన్ని స్వయంగా ఓ మత బోధకుడు వెల్లడించడం అమెరికాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర కొరియా వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, శాంతి, సహనాలను ప్రబోధిస్తూ, చర్చలను మాత్రమే ప్రోత్సహించే ఎవాంజలికవ్ వర్గం ఆయనకు మద్దతు ఇచ్చింది.

Dallas Pastor Says Trump Given God’s Authority To ‘Take Out Kim Jong-Un’

ఎవాంజలికల్ సలహాదారు రోబెర్ట్ జెఫెర్స్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. బైబిల్ లోని రోమన్స్ చాప్టర్ లో స్పష్టంగా పేర్కొన్న విధంగా దేశ రక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఉత్తర కొరియాపై బాంబు దాడులు చేసేందుకు దేవుడి నుంచి అనుమతి లభించిందని అన్నారు.

దుష్ట శక్తులను అంతం చేయడానికి తమ దేశాధినేతకు అనుమతి లభించిందని డల్లాస్ లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో వేలాది మందిని ఉద్దేశించి ఎవాంజలికల్ సలహాదారు రోబెర్ట్ జెఫెర్స్ వ్యాఖ్యానించడం అమెరికాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇలా దేశంలోని పలు వర్గాల నుంచి మద్దతు పెరుగుతూపోతే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఏ క్షణాన అయినా నార్త్ కొరియాపై దాడికి దిగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+