డాన్ కు భారీ షాక్: టీవీ చానెల్ హ్యాకింగ్ - పాక్ ఇళ్లల్లో భారత జెండా - అసలేం జరిగింది?
అసలే కరోనా కాలం.. భయంభయంగానే బక్రీద్ జరుపుకొని.. సండే వార్తా విశేషాల కోసం టీవీలు పెట్టిన పాకిస్తానీలకు ఊహించని దృశ్యాలు కనిపించాయి. నిప్పు-ఉప్పులా వ్యవహరిస్తోన్న దాయాదుల మధ్య దౌత్య సంబంధాలు కూడా క్షీణిస్తోన్న తరుణంలో.. పాకిస్తాన్ ఇళ్లలోని టీవీల్లో భారత జాతీయ జెండా ప్రత్యక్షం కావడం, ముందస్తు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు కనిపించడం కలకలం రేపింది.
Recommended Video
పాకిస్తాన్ లోని అతిపెద్ద, మోస్ట్ పాపులర్ న్యూస్ ఛానెలైన 'డాన్ టీవీ'కి హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ఏకంగా లైవ్ ప్రసారాలనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం.. డాన్ టీవీలో ఓ యాడ్ ప్రసారం అవుతోండగా.. తెరలపై సడెన్ గా భారత జాతీయ జెండా కనిపించింది. జెండాతో పాటు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే సందేశం కూడా రాసుంది. ఈ అనూహ్య సంఘటనతో డాన్ టీవీ సిబ్బంది,యాజమాన్యం షాక్ కు గురయ్యారు.

తమ టీవీ చానెల్ పై హ్యాకర్లు దాడి చేశారని గుర్తించిన వెంటనే డాన్ టీవీ అప్రమత్తమైంది. సంబంధం లేని దృశ్యాలను టెక్నికల్ సిబ్బంది తొలగించారు. అయితే, ఎంతకాలంపాటు హ్యాకర్లు టీవీ ప్రసారాలను కంట్రోల్ చేశారు, అసలేం జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డాన్ యాజమాన్యం తెలిపింది. పోలీసు శాఖ ఐటీ విభాగానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చరిత్ర పొడవునా ఒక్కటిగా ఉండి, 1947 ఆగస్టు 14 పాకిస్తాన్, ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందడం తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగనుండగా హ్యాకర్ల ముందస్తుగానే శుభాకాంక్షలంటూ హల్ చల్ చేశారు.
డాన్ టీవీపై సైబర్ దాడి చేసింది భారతీయ హ్యాకర్లే అయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల సంబంధాల నేపథ్యంలో ఔత్సాహిక హ్యాకర్లు తరచూ పరస్పరం సైబర్ దాడులకు పాల్పడిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. ఇటీవలే పీవోకేలోని కీలక ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైట్లు సైతం హ్యాకింగ్ కు గురయ్యాయి. ఆయా వెబ్ సైట్లలో ''కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుతున్నారు''తరహా రాతలు దర్శనమిచ్చాయి.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
HIV : 300కు పైగా చిన్నారులకు హెచ్ఐవి - డాక్టర్ నిర్లక్ష్యమే కారణం..!! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications