బాలీవుడ్ నటిని పెళ్లాడిన దావూద్, రహస్య కొడుకు!
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను సిబిఐ మాజీ డైరెక్టర్ నీరజ్ కుమార్ తన తాజా పుస్తకంలో వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం సదరు సిబిఐ అధికారితో మూడుసార్లు ఫోన్ ద్వారా సంభాషించారని, ఇందుకు సంబంధించిన ఆయన పుస్తకంలో వెల్లడించారని వార్తలు వస్తున్నాయి.
ఆ సిబిఐ మాజీ అధికారి డయల్ డి ఫర్ డాన్ అనే పుస్తకం రాశాడు. ఆందులో ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు.
తాను రిటైరయ్యే కొద్ది రోజుల ముందు ఫోన్ వచ్చిందని... 'మీరు రైటైర్ కాబోతున్నారు, నా కేసు గురించి ఆలోచించకండని' దావూద్ చెప్పారని పేర్కొన్నారు.

అప్పుడు నీరజ్ కుమార్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. తన పర్సనల్ నెంబర్‌కు కాల్ వచ్చిందని చెప్పారు. తాను రిటైరయ్యాక తనకు భద్రత ఉండదని అతను పరోక్షంగా హెచ్చరించాడని పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం రహస్యంగా ఓ బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకున్నాడని, ఆయనకు ఓ కొడుకు కూడా ఉన్నాడని ఆ పుస్తకంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆ రహస్య కొడుకు బెంగళూరులో ఉన్నారని తెలుస్తోందని పేర్కొన్నారని సమాచారం.
1976 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన నీరజ్ కుమార్... 1993 ముంబై వరుస పేలుళ్ల కేసు దర్యాప్తును కూడా పర్యవేక్షించారు. ఈ పుస్తకంలో మొత్తం 11 కేసుల దర్యాప్తునకు సంబంధించిన వివరాలున్నాయి. దావూద్ ఇబ్రహీంతో తన సంభాషణల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications