వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమన్‌కు ఉరి: హీరో సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డ తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్‌ను ఉరితీయవద్దంటూ ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పైన ఆయన తండ్రి సల్మాన్ ఖాన్ మండిపడ్డాడు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన గురించి సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం అవగాహన లేదన్నాడు.

ట్విట్టర్‌లో అతని రాతలన్నీ అర్థరహితమైనవని, తెలివితక్కువతనాన్ని బయటపెట్టేలా ఉన్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సలీం ఖాన్ మీడియాతో మాట్లాడారు. యాకూబ్ మెమన్ ఉరితీత విషయంలో తన కొడుకు సల్మాన్ ఖాన్ అభిప్రాయంతో ఏకీభవించారు.

యాకూబ్ మెమెన్ దోషి అయినప్పటికీ ఉరి విధించకుండా అతడిని జీవితాంతం జైలులో ఉంచడమే సరైన శిక్ష అని సలీం ఖాన్ అన్నారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సల్మాన్ ఖాన్ ట్వీట్ల పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Death Sentence: Bollywood actor Salman Khan ignites Yakub Memon controversy

ఇంటివద్ద బందోబస్తు

సల్మాన్ తన ట్వీట్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ముంబై పేలుళ్ల కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన స్పెషల్ పబ్లిస్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ కోరారు. కోర్టు తీర్పులను తప్పు పట్టడం సరికాదన్నారు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ముంబై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బిజెపి ఆగ్రహం

ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్‌ను ఉరి తీయడం మానవత్వాన్ని ఉరితీయడమేనన్న సల్మాన్ వ్యాఖ్యల పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సల్మాన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది.

పార్లమెంటులో రేపు సల్మాన్ ఖాన్ వ్యవహారాన్ని లేవనెత్తుతామని బిజెపి ఎంపి కిరీటీ సోమయ్య అన్నారు. సల్మాన్ ఖాన్ న్యాయస్థానం తీర్పు పడుతున్నారా అని శివసేన ప్రశ్నించింది. ఎన్సీపీ కూడా సల్మాన్ వైఖరిని తప్పు పట్టింది.

English summary
Days before Yakub Memon's capital punishment, Bollywood actor Salman Khan ignited the controversy. Speaking about Yakub Memon's death sentence, the actor surprised everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X