విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఇలా నిత్యం విమానాలు టెక్నాలజీ సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి.
తాజాగా డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ విమానం.. 25 మంది ప్రయాణికులతో వెళ్తుండగా భారీ కుదుపులకు లోనైంది. విమానం సాల్ట్ లేక్ నుంచి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం భారీ కుదుపుల కారణంగా 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఎట్టకేలకు విమానం సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. కుదుపులు సహజం కానీ ఇలాంటి భారీ కుదుపులు అసలు ఊహించలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications