డేంజరస్ డెల్టా: పెరుగుతున్న ఆక్సిజన్ నీడ్.. డబ్ల్యుహెచ్‌వో ఆందోళన
డెల్టా వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ వేరియంట్ విలయ తాండవం చేస్తోంది. డెల్టా వేరియంట్ చాలా వేగంగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు వేరియంట్లు ప్రమాదకరంగా ఉండగా, అతి త్వరలో డెల్టా వేరియంట్ ఈ జాబితాలో తొలిస్థానానికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. డెల్టా కేసులు పెరగడం వల్ల పలు దేశాల్లో ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయని చెప్పింది.

సిచుయేషన్ బాగోలేదు..
తక్కువ, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో పరిస్థితులు అంత బాగాలేవని తెలిపింది. ఈ వేరియంట్‌ను నియంత్రించడం కోసం ప్రపంచంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. 7.7 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ర్యాపిడ్ ఏసీటీ-ఆక్సిలరేటర్ డెల్టా రెస్పాన్స్‌గా పిలిచే ఈ పథకాన్ని వచ్చే నాలుగు నెలల్లో ఆమోదించాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. ఈ ఆమోదం లభిస్తే కరోనా టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే మరిన్ని కొత్త వేరియంట్లను ముందుగానే గుర్తించవచ్చని ఈ సంస్థ పేర్కొంది.

ఆక్సిజన్ కొరత
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మరింత ఆక్సిజన్ అందించవచ్చని, ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం కుదురుతుందని తెలిపింది. ఈ రాడార్ పథకం కొత్తదేమీ కాదని, ఏసీటీ-ఆక్సిలరేటర్‌కు ప్రతిపాదించిన మొత్తం 2021 బడ్జెట్‌లో భాగమని చెప్పింది. 2020 మొత్తంలో నమోదైన కరోనా కేసుల కన్నా 2021 తొలి 5 నెలల్లోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు కరోనా వేరియంట్లు ప్రబలుతున్నాయని, అయితే వీటికన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.

6 ఏళ్లు ప్రభావం..
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

ఫంగస్ బెడద
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications