వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్‌కు విరుగుడు .. కొత్త మందు క‌నుగొన్న‌ డెన్మార్క్ శాస్త్ర‌వేత్త‌లు

|
Google Oneindia TeluguNews

క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్‌ను ఎదుర్కొనేందుకు డెన్మార్ శాస్త్ర‌వేత్త‌లు ఒక స‌రికొత్త ప‌దార్థాన్ని క‌నుగొన్నారు. ప్ర‌స్తుతం ఈ మ‌హమ్మారి నివార‌ణ‌కు వాడుతున్న యాంటీ బాడీల‌ను త‌యారు చేసే ఖ‌ర్చుకంటే త‌క్కువ ఖ‌ర్చుతోనే ఈ ప‌దార్థాన్ని త‌యారు చేయ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఆర్హ‌స్ యూనివ‌ర్సిటీ చేప‌ట్టిన ఈ పరిశోధ‌న‌లకు సంబంధించిన వివ‌రాల‌ను పీఎన్ఏఎస్ ప‌త్రిక‌ వెల్ల‌డించింది.

ఆర్గానిక్ కాంపౌండ్‌

ఆర్గానిక్ కాంపౌండ్‌

క‌రోనా వైర‌స్‌ మాన‌వ క‌ణాల్లోకి ప్ర‌వేశించ‌కుండా నిరోధించే విధంగా ఒక చిన్న సైజు ఆర్గానిక్ కాంపౌండ్‌ను డెన్మార్క్ శాస్త్ర‌వేత్త‌లు అభివృద్ధి చేశారు. ఈ ఆర్గానిక్ కాంపౌండ్‌ను మాలిక్యూల్ గా పేర్కొన్నారు. ఇది ఎంఆర్ఎన్ఏ ఆస్టామ‌ర్స్ జాతికి చెందిన‌ది. ఆర్ఎన్ఏ టీకాలు త‌యారీలో వినియోగించే బిల్డింగ్ బ్లాక్స్ ఈ కాంపౌండ్‌లో ఉంటాయని తెలిపారు. ఇది వైర‌స్ ఉప‌రిత‌లానికి అంటుకోగానే వైర‌స్‌లో దాగిన స్పైక్ ప్రొటీన్ మాన‌వ క‌ణంలోకి ప్ర‌వేశించ‌కుండా నిరోధించ‌వ‌చ్చ‌ని శాస్త‌వేత్త‌లు వెల్ల‌డించారు.

కొత్త ప‌దార్థం.. దాని ప‌నితీరు..

కొత్త ప‌దార్థం.. దాని ప‌నితీరు..

ఈ ప‌ధార్థంలోని అణువులు క‌రోనా వైర‌స్ స్పైక్ ప్రోటీన్‌ల‌ను గుర్తించి వాటికి అతుక్కుపోతాయి. దీని ద్వారా అవి శ‌రీరంలో ఇత‌ర క‌ణాల‌కు వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకుంటాయని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ కొత్త ప‌దార్థంలో అస్టామ‌ర్ త‌ర‌గ‌తికి చెందిన అణువులు ఉంటాయి. ఇవి 3డీ ఆకృతిలో ఉంటాయి. వీటిలో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ జ‌న్యు పదార్థాలు ఉంటాయి. ఇవి నిర్థిష్ట అణువుల‌ను గుర్తించి వాటిని ల‌క్ష్యంగా చేసుకుంటాయి. త‌ద్వారా వైర‌స్ అంత‌ర్గ‌త శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌కుండా ఈ ఆస్టామ‌ర్‌లు అడ్డుకుంటాయి. క‌నుక‌నే శాస్త్ర‌వేత్త‌లు ఈ ఆర్ఎన్ఏ ఆస్టామ‌ర్ల‌తో కూడిన అణువుల‌తో కొత్త ప‌దార్థాన్ని త‌యారు చేశారు.నానో, యాంటీ బాడీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఈ కొత్త ప‌దార్థం స్పైక్ ప్రొటీన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చికిత్స చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధకులు తెలిపారు.

ఒమిక్రాన్‌పై ప్ర‌యోగం..

ఒమిక్రాన్‌పై ప్ర‌యోగం..


ఈ కొత్త ఆస్టామ‌ర్లు బీటా, డెల్టా వంటి వేరియంట్ల క‌రోనా వైర‌స్‌ల‌ను సుల‌భంగా గుర్తించాయి. ఇది క‌రోనా వైర‌స్‌ను నిరోధించ‌డానికే కాకుండా, గుర్తించ‌డానికి కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే ఒమిక్రాన్‌పై కూడా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

English summary
Denmark scientists have discovered a new drug for Corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X