'టర్కీలో తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్తాంబుల్: ప్రభుత్వంపై తిరుగుబాటు యత్నించి విఫలయత్నమైన తిరుగుబాటుదారులను టర్కీ ప్రభుత్వం క్రూరంగా హింసిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన వివరాలను దీనినే తెలియజేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... గత వారంలో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటులో పాల్గొన్న, అందుకు సహకరించిన 13,615 మందిని బందీలుగా టర్కీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఎక్కువగా సైనిక అధికారులు, లాయర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, పౌరులు ఉన్నారు.

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'


అయితే సైనిక తిరుగుబాటులో పాల్గొన్న వీరి పట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆమ్నెస్టీ వెల్లడించింది. ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న వారికి ఆహారం అందించకుండా.. తీవ్రంగా హింసించడంతో పాటు కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.

 'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ యూరప్ డైరెక్టర్ జాన్ డౌలిస్టియన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు టర్కీ ప్రభుత్వానికి సూచించారు. బందీలుగా ఉన్న వారిని నాలుగు రోజులకు విడుదల చేయాల్సి ఉన్నా 30 రోజుల వరకు జైలులోని ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు.

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'


బందీలుగా ఉన్న వారిని జైలు జీవితాన్ని ఎక్కువ రోజులకు పెంచి వారిని మరింతగా వేధింపులకు గురి చేసేందుకేనని ఆయన తెలిపారు. బంధీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది.

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'

'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'


మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం చూస్తున్న తమ దేశం అనుచిత చర్యలకు పాల్పడదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మరోవైపు సోమవారం ప్రభుత్వ మద్దతుదారులు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Human rights group Amnesty International says it has received credible evidence of detainees in Turkey being subjected to beatings and torture, including rape, since last week's failed coup attempt.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి