వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు మీదకు దూసుకు వచ్చిన డీహెచ్ ఎల్ విమానం

|
Google Oneindia TeluguNews

రోమ్: ఇటలీలో ఓ విమానం రోడ్డు మీదకు దూసుకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి, ప్రాణ నష్టం జరగలేదు. పేలుడు లాంటి సంఘటనలు జరగకపోవడంతో ఎయిర్ పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 - 400 అనే కార్గో విమానం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఇటలీలోని లాంబార్జీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రంలో దిగడానికి ప్రయత్నించింది. అయితే విమానం అదుపు తప్పింది.

విమానం రన్ వే దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రోడ్డు మీదకు దూసుకు వెళ్లింది. అటు వైపు సంచరిస్తున్న వాహన చోదకులు విషయం గుర్తించి వెంటనే వారి వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు.

ఈ ప్రమాదం కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. విమాన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్ పోర్టు అధికారులు మీడియాకు చెప్పారు.

English summary
Dramatic pictures show the nose of the ASL Airlines Boeing 737-400, which was chartered by courier firm DHL, wedged across an airport ring road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X