వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

404 క్యారెట్లు: అంగోలాలో అతిపెద్ద వజ్రం గుర్తింపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అంగోలా: ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాన్ని అంగోలాలో కనుగొన్నారు. విలువైన వజ్రాల అన్వేషణలో భాగంగా పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన లుకాపా డైమండ్ కంపెనీ అతి పెద్ద వజ్రాన్ని కనుగొంది. ఈ వజ్రాన్ని అంగోలాకి చెందిన జాతీయ డైమండ్ కంపెనీ అయిన లుకాపాతో కలిసి ప్రైవేట్ కంపెనీ అయిన రోసాస్ & పెటాలస్ కనుగొంది.

అంగోలాలోని మారుమూల ప్రాంతంలో 700 కిలోమీటర్ల లోతట్టు తీరంలో ఈ అపురూపమైన వజ్రాన్ని కనుగొన్నారు. 404 క్యారెట్ల నాణ్యతను కలిగి ఉన్న ఈ వజ్రం 7 సెంమీ చుట్టుకొలతతో ఉన్నట్లు గుర్తించింది. ఈ వజ్రం విలువ సుమారు 14 మిలియన్ డాలర్ల పైగానే ఉంటుందని లుకాపా సంస్థ ఛైర్మన్, మైల్స్ కెన్నడీ ప్రకటించారు.

న్యూయార్క్‌కు చెందిన డైమండ్ రిటైలర్ యెహుడా ఇప్పటికే ఈ డైమండ్ నాణ్యతను పరీక్షించినట్లు లుకాపా డైమండ్ కంపెనీ పేర్కొంది. వజ్రం మొత్తం కూడా కలర్ లేకుండా తెలుపు రంగంలో ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలో ఇలాంటి వజ్రాలు ఎంతో అరుదుగా లభిస్తాయని కూడా చెప్పుకొచ్చింది.

Diamond weighing 404 carats is one of the largest ever found

అంగోలా దేశంలో ఈ వజ్రమే అతిపెద్దదని, తమ అన్వేషణలో బయటపడిన ఈ వజ్రం ప్రపంచంలో 28వ అతిపెద్ద వజ్రమని వెల్లడించారు. వజ్రాల కోసం మధ్య అంగోలాలోని 1,148 స్క్వేర్ మైళ్ల పరిధిలో లుకాపా డైమండ్ ప్రాజెక్టు తమ వంతు ప్రయత్నాలు ఇలానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇంకా ఈ ప్రాంతంలో 60కు పైగా వజ్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని ఎస్ఎస్ఎక్స్ స్టాక్ ఎక్సేంజ్‌లో లుకాపా డైమండ్ కంపెనీ లిస్ట్ అయి ఉంది. మరోవైపు అతిపెద్ద వజ్రం కనుగొన్నామని ప్రకటించిన వెంటనే లుకాపా కంపెనీ షేర్లు 29 శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి.

English summary
A massive diamond among the largest ever discovered was recently unearthed in Angola, mining company Lucapa announced Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X