• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాడీగార్డ్‌తో వెళ్లాలనుకున్న ప్రిన్సెస్ డయానా?: సంచలనమవుతున్న వీడియోలు!

|

లండన్: ప్రిన్సెస్‌ డయానాకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్యారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్స్ డయానా మరణించి 20 ఏళ్లు గడిచిపోయినా బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె విఫల వైవాహిక జీవితం, ఆమె ప్రేమకు సంబంధించిన కథనాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రిన్స్ చార్లెస్‌తో వైవాహిక జీవితంనుంచి తప్పించుకోవడానికి డయానా పీకల్లోతు ప్రేమలో పడిన తన బాడీగార్డు ఒకరితో పారిపోవాలనుకున్నట్లు ఆమె తన వాయిస్ కోచ్‌తో రహస్యంగా రికార్డు చేసిన వీడియోలను బట్టి తెలుస్తోంది.

కెన్సింగ్‌టన్‌ ప్యాలెస్‌లో 1992-93మధ్య వీటిని రికార్డుచేశారు. స్వరాన్ని పరీక్షించే సమయంలో ఆమె మాటలను రికార్డు చేశారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలు చెప్పడంతో అవి కూడా రికార్డయ్యాయి. 1991లో ఛార్లెస్‌తో విడిపోయిన అనంతరం తన భావాలను ప్రజలకు చెప్పేందుకు వీలుగా సహాయ పడడం కోసం ఆమె సెట్టెలన్‌ను నియమించుకున్నారు. వీటిని త్వరలో తొలిసారిగా ఛానెల్‌-4 ప్రసారం చేయనుంది.

తన అంగరక్షకుడు బారీ మన్నాకీతో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని, ప్రిన్స్‌ ఛార్లెస్‌కు, కెమిల్లా పార్కర్‌తో ఉన్న సంబంధాలపై ఆమె చెప్పిన విషయాలు ఇందులో ఉన్నాయి. 'నేను 24, 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ వాతావరణంలో పనిచేసిన ఓ వ్యక్తి ప్రేమలో పూర్తిగా పడిపోయా. నేను సంతోషంగా వీటన్నింటినీ విడచిపెట్టి వెళ్లిపోవాలనుకున్నా. ఆయన కూడా ఇది మంచి ఆలోచనే అని అన్నాడు' అని డయానా పేర్కొన్నారు.

Diana tapes reveal Queen’s reply to sobbing plea over loveless marriage

అంతేగాక, 'నేను బాగున్నానని చెప్పే మనిషి ఒకరు నాకు కావాలి. ఆయన నాకు మానసికంగా ధైర్యం చెప్పి బయటకు వెళ్లమనేవాడు. నేను ఈ గది (కెన్సింగ్‌టన్‌ ప్యాలెస్)లో కేకలు వేసేదాన్ని. నేను నిప్పుతో చెలగాటమాడలేదు. చేతులు కాల్చుకోలేదు' అని అన్నట్టు సండే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. అయితే ఇది శారీరక సంబంధం కాదని ఆమె స్పష్టం చేశారు.

కాగా, 'ఆయనను బయటకు పంపించి వేశారు. అనంతరం ఆయన మోటారుబైకు ప్రమాదంలో చనిపోయాడు. అది నా జీవితంలో పెద్ద దెబ్బ' అని చెప్పారు. అంతేగాక, ఇతర మహిళలతో ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఉన్న సంబంధాలపై డయానా ఆయనను అడగడం, అందుకు ఆయన చెప్పిన సమాధానాలూ ఈ టేపుల్లో ఉన్నాయి.

'వేల్స్‌ రాకుమారుల్లో మహిళలతో సంబంధాలు పెట్టుకున్నవారు నేనొక్కడినే అంటే ఒప్పుకోను' అంటూ ఛార్లెస్‌ ఆమెకు సమాధానం చెప్పారు. ఈ సంగతిని ఆమె అత్త, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు చెప్పినప్పుడు 'నీవు ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఛార్లెస్‌ పనికిరానివాడయ్యాడు' అని నిస్సహాయత వ్యక్తం చేశారు.

కాగా, చానెల్-4 ఏడు టేపులలోని ముఖ్యాంశాలను మాత్రమే తీసుకుంది. మొత్తం 12 టేపులుంటే మిగతా అయిదు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, రాకుమారులు విలియం, హారీలకు ఇబ్బంది దృష్ట్యా వీటిని ప్రసారం చేయకూడదని డయానా సోదరుడు ఎర్ల్‌స్పెన్సర్‌ ఛానెల్‌ 4కు విజ్ఞప్తి చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Intimate revelations – direct from the mouth of Diana, Princess of Wales –about her courtship and married life to Prince Charles are to be aired on British television next month after years of dispute about the recordings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more