వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ నవ్వు బాగుందంటూ ఐరీష్ జర్నలిస్ట్ పై ట్రంప్, ఏకేసిన ఫెర్రీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరీష్ జర్నలిస్టు పట్ల వింతగా ప్రవర్తించాడుఐర్లాండ్ నూతన ప్రధానితో ఫోన్ లో మాట్లాడుతూనే జర్నలిస్ట్ ఫెర్రీ నవ్వు బాగుందని కితాబిచ్చాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకొన్నాడు. ఐర్లాండ్ కు చెందిన ఓ మహిళ జర్నలిస్ట్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరు పట్ల నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఐర్లాండ్ కు చెందిన ఓ మహిళ జర్నలిస్ట్ పట్ల ఆయన విచిత్రంగా ప్రవర్తించారు. తన గదిలో విలేకరులతో పాటు కూర్చొన్న ఆమెను సైగచేసి పిలుచుకొని మరీ నీ నవ్వు బాగుందంటూ అందరిముందు కితాబిచ్చాడు.

 Did Donald Trump flirt with Irish reporter Caitriona Perry during diplomatic phone call?

ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రి తావోయైసెచ్ లీయో వరద్కర్ ను ఫోన్ చేసి అభినందిస్తూ ....మధ్యలో ట్రంప్ ఈ విధంగా ప్రవర్తించాడు. దీంతో ఐర్లాండ్ జర్నలిస్ట్ షాక్ కు గురైంది. ఈ ఘటన మంగళవారం నాడు చోటుచేసుకొంది.

ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వరద్కర్ కు అభినందనలు తెలిపేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడుతూనే ఎంతో మంది ఐరీష్ మీడియా ప్రతినిధులు మనల్ని చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు గది నుండి బయటకు వెళ్తున్నారు.

నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడికి రా...అందమైన ఐరీష్ మీడియా ప్రతినిధులు అంటూ ట్రంప్ ఆర్ టీఈ రిపోర్టర్ కైట్రియానా పెర్రీనీ చేతితో సైగ చేసి మరీ తన దగ్గరికి పిలింపించుకొన్నారు.

ఐరీష్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడుతూనే ఆమెను ఉద్దేశించి నీ నవ్వు బాగుంది అంటూ కితాబిచ్చాడు. మొహమాటానికి ట్రంప్ దగ్గర నిలబడిన ఫెర్రీ అనంతరం ఈ ఘటనపై ట్విట్టర్ లో స్పందిస్తూ ట్రంప్ చర్య వికృతంగా ఉందని మండిపడింది.

అమెరికా నెటిజన్లు కూడ ఆమెకు మద్దతు పలికారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన వారు ట్రంప్ తరపున ఆమెకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.

English summary
Donald Trump appeared to flirt with an Irish reporter during a call with Leo Varadkar, the new Taoiseach, on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X