వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షిపణి ప్రయోగం.. అంతా వట్టిదేనా, వీడియోలో..: పాక్ నవ్వులపాలయింది!

అణ్వాయుధాలు మోసుకెళ్లగల క్షిపణి బాబర్ 3ని సముద్రంలోని జలాంతర్గామి నుంచి పాకిస్తాన్ సోమవారం నాడు విజయవంతంగా ప్రయోగించినట్లుగా వచ్చిన వార్తల పైన అనుమానాలు కలుగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

కరాచీ: అణ్వాయుధాలు మోసుకెళ్లగల క్షిపణి బాబర్ 3ని సముద్రంలోని జలాంతర్గామి నుంచి పాకిస్తాన్ సోమవారం నాడు విజయవంతంగా ప్రయోగించినట్లుగా వచ్చిన వార్తల పైన అనుమానాలు కలుగుతున్నాయి. తమ ప్రయోగం విజయవంతమైనట్లు పాక్ తెలిపింది.

450 కి.మీ. రేంజ్‌లో ప్రయోగించగల ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. బాబర్ 2 వెర్షన్ నుంచి అభివృద్ధి చేసిన బాబర్ 3 నీటి నుంచి ప్రయోగించగల తొలి క్షిపణి. దాయాది దేశాలైన భారత్, పాక్ 1998లో అణు సామర్థ్య దేశాలుగా ప్రకటించుకున్నాయి. నాటి నుంచి అణు క్షిపణులను పరీక్షిస్తున్నాయి.

అయితే, తాజాగా పాకిస్తాన్ ప్రయోగించినట్లుగా చెబుతున్న బాబర్ 3 విషయంలో మాత్రం అది తప్పులో కాలేసిందని నిపుణులు చెబుతున్నారంటున్నారు. బాబర్ 3ని బూచీగా చూపి భారత్‌ను భయపెట్టాలనుకున్న పాకిస్తాన్ బొక్కబోర్లా పడిందంటున్నారు.

Did Pakistan fake video of nuclear missile Babur-3's launch? Photoshop expert thinks so

450 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బాబర్-3 అవలీలగా ఛేదిస్తుందని పేర్కొనడమే కాకుండా.. భారత్‌లోని చాలా ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పింది.

భారత్ 2008లో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 2013లో మరోసారి జలాంతర్గామి నుంచి ప్రయోగించగల క్రూయిజ్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది.

దీంతో పాక్ ఆ తరహా క్షిపణులను అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. సోమవారం ఒక్కసారిగా సబ్ మెరైన్ నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర క్షిపణి బాబర్-3ను విజయవంతంగా పరీక్షించినట్టు చెప్పి, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Did Pakistan fake video of nuclear missile Babur-3's launch? Photoshop expert thinks so

అయితే నిజానికి పాక్ ప్రయోగం మొత్తం బూటకమని నిపుణులు చెబుతున్నారు. పాక్ విడుదల చేసిన వీడియో మొత్తం కల్పితమని, దానిని అద్భుతంగా గ్రాఫిక్స్ చేశారని చెబుతున్నారు.

ఫొటోషాప్‌ను ఉపయోగించిన విషయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. పాక్ చెబుతున్న వేగానికి అది ప్రయాణించిన దానికి అస్సలు సంబంధం లేదంటున్నారు. అలాగే మొదట్లో పసుపు వర్ణంలో ఉన్న క్షిపణి క్రమంగా తెల్లగా మారిందని ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ విడుదల చేసిన వీడియోలో చాలా లోపాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వీడియోను గ్రాఫిక్స్‌తో రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు. పాక్ బాబర్ 3 క్షిపణి ప్రయోగం అంతా ఉత్తిదేనంటూ అందులోని నకిలీ ప్రయోగమంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

English summary
Did Pakistan fake video of nuclear missile Babur-3's launch? Photoshop expert thinks so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X