వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్ష రేపిన విధ్వంసం.!పరాకాష్టకు చేరిన జాత్యహంకారం.!ఆకాశం నుండి అదఃపాతాళానికి చేరిన అమెరికా.!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలను తోసిరాజంటూ దూసుకెళ్తున్న అగ్రరాజ్యం. అభివృద్ది చేందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలవడమే కాకుండా తీవ్రవాద ప్రభావితి దేశాలకు ఆపన్న హస్తం అందించే పెద్దన్నగా, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు ఆర్ధిక సాయం అందిచే కుటుంబపెద్దగా.. ఎన్నో పాత్రలను పోషిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న అగ్ర రాజ్యం ఒక్కసారిగా సభ్యసమాజం ముందు తలదించుకుంది. ఎప్పుడో సమసిపోయిన వర్ణ వివక్షను మళ్లీ రగిల్చిన తెల్ల జాతీయులు తగిన మూల్యం చెల్లించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

 జాత్యహంకారం చూపిన అమెరికా..

జాత్యహంకారం చూపిన అమెరికా..

ఔను ఇది వివక్షే.. ముమ్మాటికి వర్ణ వివక్ష. ఎప్పుడో రూపుమాసిపోయి అభివృద్దిలో పోటీ పడుతూ మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో సభ్య సమాజం సిగ్గపడే పని చేసింది అగ్రరాజ్యంగా ముద్రవేసుకున్న అమెరికా. ఇతర గ్రహాలపై గృహాలు, చందమామపై నివాస స్థలాల నిర్మణం వైపు దూసుకెళ్తున్న అమెరికా దేశం ఓ దిక్కుమాలిన పని వల్ల ఆ దేశ పౌరుల ఆలోచనా విధానాలు ఎంత బూజుపట్టి ఉన్నాయో అర్థమవుతోంది. సమాజంలో ఉన్నత వర్ణం, అణగారిన వర్ణం అనే బేధ భావం వల్ల ఏం సాధిస్తారో తెలియని అమాయకత్వంలో అమెరికా పౌరులు కొట్టుమిట్టాడుతున్నారంటే ఆదేశం ప్రగతి పథంలో పయనించడం కాదు, మూర్ఖత్వంలో మగ్గుతున్నట్టే లెక్క.

 శాస్త్ర సాకేతికతలో దూసుకెళ్తున్న దేశం..

శాస్త్ర సాకేతికతలో దూసుకెళ్తున్న దేశం..

అమెరికాలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నలభై ఆరేళ్ల నల్ల జాతి వ్యక్తి మరణం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోంది. మే 25న ఫ్లాయిడ్ గొంతుపై ఓ పోలీసు అధికారి కాలు వేసి గట్టిగా అదిమిపట్టడంతో, జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు విడిచాడు. జాత్యహంకారం నేపథ్యంలోనే ఫ్లాయిడ్ ను చంపేసారని అమెరికా వ్యాప్తంగా నల్లజాతి వారు భగ్గుమంటున్నారు. అంతే కాకుండా అమెరికాలోని అనేక నగరాలు ఆందోళనలతో రగిలిపోతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు దుకాణాలు లూటీ చేస్తున్నారు. అమెరికాలో అత్యధిక చోట్ల కర్ఫ్యూ ఉన్నప్పటికీ దౌర్జన్య కాండలు, లూటీలు ఆగడం లేదు. నిరసన కారుల ఆగ్రహావేశాలకు ఎంతో ఆస్థినష్టం సంభవిస్తోంది.

ఈ రోజుల్లో వర్ణ వివక్షఏంటిరా..?

ఈ రోజుల్లో వర్ణ వివక్షఏంటిరా..?

అమెరికా దేశం గత కొన్ని సంవత్సరాలుగా శాంతియుతంగానే ముందుకు వెళ్తోంది. ఉద్యోగాల్లో అందరికి సమాన హక్కు కల్పిస్తూ తెల్ల జాతి, నల్ల జాతి అనే భేదం లేకుండా పయపనిస్తోంది. కాని అది నివురుగప్పిన నిప్పు మాత్రమేనని జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం గుర్తు చేస్తోంది. అమెరికాలో 1992 తర్వాత అల్లర్లను అదుపుచేయడానికి సైన్యం రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత చేదాటిపోయిందో తెలుస్తోంది. విధ్వంసాలు, బెదింరింపులు, బౌతిక దాడులు, నిరసనలు, లూటీలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. న్యూయార్క్, చికాగో, అట్లాంటా, లాస్ ఏంజెలెస్ వంటి చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.

Recommended Video

California earthquake : A magnitude 5.5 earthquake near Ridgecrest
వర్ణ వివక్ష చెలరేగడంతో అదఃపాతాళారికి చేరిన అమెరికా..

వర్ణ వివక్ష చెలరేగడంతో అదఃపాతాళారికి చేరిన అమెరికా..

వర్ణ వివక్ష ఉగ్రరూపం దాల్చితే ప్రతిఫలం ఎలా ఉంటుందో అమెరికాకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు నల్ల జాతీయులు. చాలా ప్రాంతాల్లో కార్లు, దుకాణాలు భవనాలను అగ్ని కీలలకు ఆహుతిస్తున్నారు. లాస్ ఏంజెలెస్ లో ప్రముఖ దుకాణాలు లూటీ కాగా, న్యూయార్క్ లో ఆందోళనకారులు దాదాపు 20 కార్లను దగ్ధం చేశారు. కాలిఫోర్నియా, చికాగో, అట్లాంటాలో హింసాత్మక నిరసనలను నియంత్రించటానికి కర్ఫ్యూ విధించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జార్జ్ దారుణ దుస్సంఘటన జరిగిన మినియాపోలిస్ లో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చినా, పలు నగరాల్లో రాళ్లు, పెట్రోల్ బాంబులతో పోలీసులపై దాడి చేసి ఓ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. దీంతో వర్ణ వివక్ష సంబంధించిన విద్వేషాలు ఏ స్దాయిలో ఉంటాయో చెప్పకనే చెప్పుకొస్తున్నారు నల్ల జాతీయులు.

English summary
The death of George Floyd, a forty-six-year-old black man in the city of Minneapolis, USA, has been raging across the country.George Floyd died when a police officer broke his leg and stabbed Floyd's throat. Black people across America are claiming that Floyd was killed in the face of racism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X