చైనా, ఇండియాల మధ్య ఉద్రిక్తత: పట్టించుకోని చైనా యువత, కారణమిదే!

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ఎప్పుడు యుద్దం జరుగుతోందనే వార్తలు చైనా, ఇండియా మీడియాల్లో ప్రముఖంగా కన్పిస్తున్నాయి.

బీజింగ్: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ఎప్పుడు యుద్దం జరుగుతోందనే వార్తలు చైనా, ఇండియా మీడియాల్లో ప్రముఖంగా కన్పిస్తున్నాయి.అయితే చైనా యువత మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

భారత్ ,చైనా, భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతమైన డోక్లాంలో ఉద్రిక్తతలు చోటుచేసుకొన్నాయి. ఈ విషయమై చైనా అధికారిక మీడియా గ్లోబల్ ప్రతిరోజూ ఏదో ఒక వార్తను ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉంది.

ఇండియాపై ఎప్పుడు చైనా యుద్దానికి దిగుతోందనే రీతిలో వార్తలు వస్తున్నాయి. సిక్కిం సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన సైన్యం మోహరించింది.

Doklam not trending: Chinese youth have little interest in border row

ఈ విషయమై పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. చైనా అధికారిక పత్రికలో ఈ విషయమై కనీసం ఏదోఒక వార్త లేకుండా ఉండడం లేదంటే అతిశయోక్తి కాదేమో.

అసలు చైనా, ఇండియాల మధ్య సరిహద్దు సమస్య వచ్చినట్టు కూడ చైనా యువతలో అత్యధికులకు తెలియదు. చైనాలో ట్విట్టర్ వర్షన్ వీబోను 34 కోట్ల మంది వాడుతున్నారు.

ఇటీవల కాలంలో ట్రెండింగ్ అవుతున్న 50 టాపిక్‌లలో డోక్లాం లేదా ఇండియా, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల అంశం లేదు.

ఇండియాపట్ల సాధారణ ప్రజలకు ఏ మాత్రం వ్యతిరేకత లేదని, అందువల్లే సోషల్ మీడియాలో చర్చలు సాగడం లేదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+