అప్పట్లో నెహ్రూ.. ఇప్పుడు మోడీ, భారత్ లో మార్పు రాదా? మళ్లీ రెచ్చిపోయిన చైనా ‘గ్లోబల్ టైమ్స్’

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: డోక్లాం స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో చైనా అధికారిక మీడియా భార‌త ప్ర‌భుత్వానికి రోజుకో ర‌కంగా హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈసారి నేరుగా ప్ర‌ధాని మోడీకే హెచ్చ‌రిక చేసింది.

1962లో కూడా చైనా చేసిన హెచ్చ‌రిక‌ల‌ను నెహ్రూ ప‌ట్టించుకోలేద‌ని, అదే ప‌ని ఇప్పుడు మోడీ కూడా చేస్తున్నార‌ని, ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌రిగే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని చైనాకు చెందిన 'గ్లోబ‌ల్ టైమ్స్' ప‌త్రిక తాజాగా ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది.

Doklam Standoff: Global Times Says Modi Govt Is As 'Naive' As Nehru's Of 1962

అప్ప‌ట్లో ప్రధాని నెహ్రూ కూడా చైనా రాజ‌కీయ ప‌రిస్థితులు స‌రిగా లేవని, దౌత్య‌విధానాలు కూడా అంతంత మాత్ర‌మే అని భావించి.. అది యుద్ధానికి దిగ‌దులే అని చైనాను త‌క్కువ అంచ‌నా వేశార‌ని, కానీ ఎన్ని క్లిష్ట‌ప‌రిస్థితులున్నా చైనా త‌మ భౌగోళిక ప‌రిధి విష‌యంలో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని స‌హించ‌లేద‌ని ఆయ‌న ఊహించ‌లేక‌పోయార‌ని ఆ కథనంలో పేర్కొంది.

ఆ త‌ర్వాత జ‌రిగిన యుద్ధ ప‌రిణామాల‌ను చ‌వి చూసి కూడా భార‌త్ ఇంకా అదే రాజ‌కీయ‌ నీతిని, అప్ప‌టి రాజ‌కీయ కుయుక్తుల‌నే ఉప‌యోగిస్తోంద‌ని, భారత్ లో ఏమాత్రం మార్పు రాలేదని 'గ్లోబ‌ల్ టైమ్స్' ఆరోపించింది. సిక్కిం ప్రాంతంలోని డోక్లాం స‌రిహ‌ద్దులో భార‌త్ - చైనా సైన్యాల మ‌ధ్య రోజురోజుకి ఉద్రిక్తత పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a new editorial on the Doklam standoff, Chinese state-run daily Global Times has once again warned that if Indian troops continue to linger on its soil, “countermeasures from China will be unavoidable”, claiming that the Narendra Modi government is as "naive" as the Jawaharlal Nehru government of 1962.“India made constant provocations at the China-India border in 1962. The government of Jawaharlal Nehru at that time firmly believed China would not strike back. China had just undergone domestic turmoil and natural disasters; Beijing and Washington were engaged in hostility and China's relations with the Soviet Union had begun to chill…Fifty-five years have passed, but the Indian government is as naïve as it ever was,” the editorial said.
Please Wait while comments are loading...