వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమా అని వారి ఆశ్చర్యం: భారత్‌కు చైనా మళ్లీ హెచ్చరిక

భారత్‌కు చైనా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. డొక్లాం నుంచి భారత్ వెంటనే తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని హితవు పలికింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్‌కు చైనా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. డొక్లాం నుంచి భారత్ వెంటనే తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని హితవు పలికింది.

చదవండి: భారత్-చైనా ఆర్మీ మధ్య దూరం 500 మీటర్లే!: అదే డ్రాగన్ వశమైతే..

మరింత తీవ్ర పరిణామాలను నివారించాలంటే సిక్కిం సెక్టర్‌లోని డొక్లాం నుంచి భారతీయ దళాలను ఉపసంహరించుకోవాలని చెప్పింది. డొక్లాంలో అక్రమంగా చొరబడటాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం విధానపరమైన సాధనంగా ఉపయోగించుకోవద్దని పేర్కొంది.

Don't Use 'Trespass' To Realise Political Targets, China Tells India

భారత్‌కతో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి బీజింగ్‌లోని విదేశీ దౌత్యవేత్తలకు సమాచారం ఇస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లూ కాంగ్ తెలిపారు.

అయితే విదేశీ దౌత్యవేత్తల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందా? అనే అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. భారత్ సరిహద్దు భద్రతా సిబ్బంది అక్రమంగా చొరబడినప్పటి నుంచి, చాలామంది విదేశీ దౌత్యవేత్తలు దిగ్భ్రాంతి చెందారని, ఇది నిజమేనా? అని అడిగారని చెప్పారు.

చైనా గత వారం విదేశీ దౌత్యవేత్తలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, భూటాన్ ట్రై జంక్షన్ వద్ద ప్రతిష్టంభనను వివరించిందని తెలుస్తోంది. దీనిని చైనా ధ్రువీకరించడం లేదు.

ఈ ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నించడంతో భారత్‌, భూటాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రోడ్డును చైనా నిర్మిస్తే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం భారతదేశానికి ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
India should not use "trespass" into the Dokalam area in the Sikkim sector as a "policy tool" to achieve its "political targets", China said today, asking New Delhi to immediately withdraw its troops to avoid any escalation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X