అభిశంసన నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్, వీగిపోయిన రెండు తీర్మానాలు, రిపబ్లికన్ల హర్షం..
Recommended Video
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కారు. అధికార దుర్వినియోగం చేస్తూ, దేశ ద్రోహనికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రెండు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ఆంక్షలపై చాలామంది సెనేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినా.. రెండు తీర్మానాలు వీగిపోవడం విశేషం.

రెండు తీర్మానాలు
అభిశంసన తీర్మానం నుంచి డొనాల్డ్ ట్రంప్ గట్టెక్కారు. 58-48, 53-47 తేడాతో అభిశంసన తీర్మానం నుంచి ట్రంప్‌కు ఉపశమనం లభించింది. మొదటి అభియోగంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మిట్ రోమ్ని వ్యతిరేకంగా ఓటువేశారు. 2012లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలోకి కూడా దిగారు. డొనాల్డ్ ట్రంప్‌పై మిట్ రోమ్నీ తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే రెండో తీర్మానంపై మాత్రం పార్టీకి లోబడి తన ఓటును వేశారు. మిగతా సభ్యులు కూడా పార్టీకి లోబడి ఓటు వేయడంతో అభిశంసన తీర్మానం నుంచి ట్రంప్ గట్టెక్కారు.

సరికాదు..
డెమోక్రాటిక్ పార్టీపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇప్పుడే కాదు గతంలో కూడా వారు ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. 2020లో వారు చేసిన చర్యను అమెరికన్లు గమనించాలని పేర్కొన్నారు. అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కిన డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం వైట్‌హౌస్ నుంచి ప్రసంగింస్తారు. అభిశంసన తీర్మానం బూటకమని డెమోక్రట్లపై విరుచుకుపడే అవకాశం ఉంది.

నిరాధార
డెమోక్రాట్ల చర్యను వెట్ హౌస్ మీడియా కార్యదర్శి స్టీపెన్ గ్రిషమ్ కూడా తప్పుపట్టారు. నిరాధార ఆరోపణలతో డెమోక్రట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఓడిపోయింది. ట్రంప్ దోషి కాదని, లేనిపోనివి ఆపాదించి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రంప్ ప్రత్యర్థులు తీర్మానం ప్రవేశపెట్టగా.. సెనేటర్లు తోసిపుచ్చారని పేర్కొన్నారు.
-
ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..! -
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications