చైనాపై ట్రంప్ పిడుగు
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు అడ్డు అదుపు ఉండట్లేదు. ఈ విషయంలో రోజుకో కొత్త ప్రకటన జారీ చేస్తోన్నారు. టారిఫ్‌ల యుద్ధానికి తెర తీశారు. వందకు పైగా దేశాలు అమెరికా టారిఫ్‌ల రాడార్‌లోకి వెళ్లిపోయాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
ఇప్పుడు తాజాగా చైనాపై మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో టారిఫ్ విధించారు. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245 శాతం మేర టారిఫ్‌ను ప్రకటించారు. ఇది- ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ట్రేడ్ వార్‌కు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. పతాక స్థాయికి తీసుకెళ్లినట్టయింది.

ఇదివరకు అమెరికా ప్రకటించిన టారిఫ్‌కు అనుగుణంగా మొదట్లో స్పందించింది చైనా. అమెరికా దిగుమతులపై 126 శాతం వరకు టారిఫ్‌ను ప్రకటించింది రెండుదశల్లో. తొలి దశలో 35, ఆ తరువాత 86 శాతం వరకు టారిఫ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి ప్రతీకారానికి దిగింది అమెరికా. ఏకంగా 245 శాతం మే టారిఫ్‌ను విధించినట్లు తెలిపింది.
ఈ మేరకు వైట్ హౌస్‌లో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఈ కొత్త టారిఫ్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది స్పష్టంగా పేర్కొనలేదు ఇందులో.
రక్షణ అవసరాలు, అంతరిక్షం, సెమీకండక్టర్ పరిశ్రమల్లో వినియోగించే కీలకమైన గ్యాలియం, జెర్మేనియం, యాంటిమొనీ వంటి వస్తువులు, పదార్థాలను చైనా ఉద్దేశపూరకంగా పరిమితం చేస్తోందని అమెరికా ఆరోపించింది. చైనా ఇటీవలే ఎర్త్ మెటల్స్‌ను ఎగుమతి చేయడాన్ని నిలిపివేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆటోమేకర్లు, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్లు, సెమీకండక్టర్ కంపెనీలు, రక్షణ అవసరాలకు ఉపయోగించే పరికరాల తయారీ/సరఫరా కాంట్రాక్టర్లను కేంద్రంగా చేసుకుని చైనా వాటి ఎగుమతులను నిలిపివేసిందని పేర్కొంది. కొత్త టారిఫ్ వల్ల ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ మరింత ఉధృతమైనట్టే.
కొత్త వాణిజ్య ఒప్పందాలను చర్చించడానికి 75 కంటే ఎక్కువ దేశాలు ఇప్పటికే తమను సంప్రదిస్తోన్నాయని వైట్ హౌస్ తెలిపింది. దీనివల్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతోందని వివరించింది. చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన టారిఫ్‌ను అమలు చేయడానికి గడువు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయంలో చైనా మాత్రం వెనక్కి తగ్గలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications