ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, తన ఓటమిని అంగీకరించిందని వెల్లడించారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం ప్రతిపాదించిన ఆ ఒప్పందం తనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా సైనిక విజయాలను మీడియా సరిగా నివేదించడం లేదంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం ఇరాన్‌పై ఎంత బాగా చేసిందో రిపోర్ట్ చేయాలంటే 'ఫేక్ న్యూస్ మీడియా'కు చాలా కోపం అని ఎత్తిపొడిచారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, ఒక డీల్ కోరుతోందని అన్నారు. అది తాను అంగీకరించే డీల్ మాత్రం కాదని పేర్కొన్నారు. ఇరాన్ జీవనాడిగా భావించే అత్యంత ప్రధానమైన ఖార్గ్ దీవిపై అమెరికా వైమానిక దాడుల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Donald Trump Claims Iran is Totally Defeated as US Forces Strike Kharg Island and wants a dea

ఖార్గ్ ఐలండ్ పై దాడులను ట్రంప్ నిర్ధారించారు కూడా. తన ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ సైనికులు మధ్యప్రాచ్య చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబింగ్ దాడులను నిర్వహించిందని అన్నారు. ఇరాన్ కిరీటంలో డైమండ్ గా భావించే ఖార్గ్ దీవిలోని ఐఆర్జీసీ శిబిరాలను తుడిచిపెట్టారని చెప్పారు. తమ ఆయుధాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి, అధునాతనమైనవనే విషయం ఈ దాడులతో తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు.

ఖార్గ్ దీవిలోని ఆయిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వివరించారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఇరాన్ అడ్డుతగిలితే, చమురు మౌలిక వసతులపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. తన మొదటి పదవీకాలంతో పాటు ఇప్పుడు కూడా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన, సమర్థవంతమైనదిగా పునర్నిర్మించానని ట్రంప్ పేర్కొన్నారు. తమను అడ్డుకునే శక్తి ఇరాన్‌కు లేదని అన్నారు.

కాగా- ఈ యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+