‘డ్రీమర్’ దెబ్బ: ఈ అమెరికా కోర్టులేంటో అంటూ ట్రంప్ అసహనం

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ్ న్యాయ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ఈ అమెరికా జూడీషియల్ సిస్టమేమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. తాను దేశానికి మంచి ఫలితాలను ఇచ్చే పనులను చేయాలనుకున్నా కోర్టులు అడ్డుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

చూస్తూ ఊరుకోం: చైనాకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్, త్వరలో ట్రంప్‌తో భేటీ!

సరైన అనుమతి పత్రాలు లేకుండా చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు అమెరికా వెళ్లి, అక్రమంగా నివసిస్తున్న డ్రీమర్స్‌(స్వాప్నికుల)ను తిరిగి స్వదేశాలకు పంపేందుకు ప్రయత్నించిన ట్రంప్‌ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అందుకే ట్రంప్ అసహనం

ఈ పథకాన్ని రద్దు చేయాలన్నప్రతిపాదనను శాన్‌ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టు తిరస్కరించింది. విచారణ ముగిసేవరకు దీన్ని కొనసాగించాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ దేశ న్యాయవ్యవస్థపై చిందులు తొక్కడం గమనార్హం.

 ట్రంప్ వాదన

ట్రంప్ వాదన

కాగా, నైపుణ్య ఆధారమైన వలసలను ప్రోత్సహించటం ద్వారా అక్రమ వలసలకు చెక్‌ పెట్టొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నాట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తద్వారా మంచి ట్రాక్‌ రికార్డున్న నిపుణులు అమెరికాకు వచ్చేందుకు వీలుంటుందని ఆయన చెబుతున్నారు.

 చైన్ మైగ్రేషన్‌కు ముగింపు పలకాల్సిందే..

చైన్ మైగ్రేషన్‌కు ముగింపు పలకాల్సిందే..

శ్వేతసౌధంలో రిపబ్లిక్, డెమొక్రాట్‌ చట్ట సభ్యుల బృందంతో ట్రంప్‌ సమావేశమయ్యారు. అమెరికాలో ప్రవేశానికి ప్రస్తుతం అనుసరిస్తున్న చైన్‌ మైగ్రేషన్‌ విధానానికి (అమెరికా పౌరుడై ఉన్న లేదా అక్కడ చట్టపరంగా నివసిస్తున్న కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌ ద్వారా ప్రవేశం పొందటం) ముగింపు పలకాల్సిన అవసరముందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విధానం ద్వారా అమెరికాలో వేగంగా, సులభంగా ప్రవేశం పొందేందుకు అనుమతి లభిస్తోంది.

అందుకే ఈ విధానం

అందుకే ఈ విధానం

కాగా, ‘వీసాల గురించి మనం ప్రవేశపెట్టే అన్ని బిల్లుల్లోనూ నైపుణ్యం అనే పదాన్ని జోడించాలి. ఎందుకంటే.. కెనడాలో, ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా మనకు కూడా నైపుణ్యాధారిత వలసలుండాలని భావిస్తున్నాను. అందుకే మంచి ట్రాక్‌ రికార్డున్న వారు మనదేశానికి వస్తే బాగుంటుంది' అని ట్రంప్‌ స్ఫష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump has criticised America's "broken" court system after he was blocked from deporting illegal migrants brought to the country while children.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి