ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)ప్రారంభించిన వార్ మూడు వారాలు పూర్తి చేసుకుంటోంది. అయినా యుద్దం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్ధితి. ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో ఇందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్న వేళ అమెరికాకు మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఇరాన్ లో చమురు క్షేత్రాల్ని టార్గెట్ చేస్తూ అంతర్జాతీయంగా చమురు సంక్షోభానికి ఆజ్యం పోస్తున్న ఇజ్రాయెల్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా ఇరాన్ లోని కీలకమైన సౌత్ ఫార్స్ చమురు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతీకారంగా అంతకంటే విలువైన ఖతార్ లోని రాస్ లఫాన్ ఆయిల్ హబ్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ చేసింది తప్పేనని, ఇది తమకు తెలియకుండా జరిగిన దాడి అని ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టులో అంగీకరించారు.

అయితే ఈ దాడికి ప్రతీకారంగా ఖతార్ పై ఇరాన్ చేసిన దాడి కూడా తప్పేనని ట్రంప్ తెలిపారు. మరోసారి ఖతార్ చమురు హబ్ పై ఇరాన్ దాడి చేస్తే తామే ఆ దేశంలోని సౌత్ ఫార్స్ చమురు క్షేత్రంపై భారీ దాడి చేసి నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రాచ్యంలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ఒక ప్రధాన కేంద్రంపై హింసాత్మకంగా దాడి చేసిందని, మొత్తం కేంద్రంలో ఒక చిన్న భాగం దెబ్బతిందని ట్రంప్ తెలిపారు. ఈ ప్రత్యేక దాడి గురించి అమెరికాకు ఏమీ తెలియదు, అలాగే ఖతార్ కూ దీనితో ఏ విధంగానూ సంబంధం లేదన్నారు. అలాగే ఇది జరగబోతోందని వారికి ఏమాత్రం ఊహ కూడా లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications