ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..!
ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కు ఇప్పుడు ఈ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. దీంతో యుద్ధం ఎన్నిరోజులు కొనసాగుతుందనే దానిపై రోజుకో ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ యుద్దం త్వరలోనే ముగిస్తామని, మరోసారి చాలా రోజులు పడుతుందని ఇలా గందరగోళ ప్రకటనలు చేస్తున్న ట్రంప్.. తాజాగా మరోసారి యుద్దం ముగింపుపై సంకేతాలు ఇచ్చారు.
ఇరాన్ యుద్దంపై తాజాగా వైట్ హౌస్ లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో అన్నట్లు, మనం ఈరోజే వెళ్ళిపోతే, జరిగిన నష్టాన్ని పునర్నిర్మించడానికి 10 సంవత్సరాలు పడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ మరే ఇతర అధ్యక్షుడూ ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి రాకుండా మనం దీనిని మరింత శాశ్వతం చేయాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఆ సమస్య మనకు మళ్ళీ ఎప్పటికీ రాకూడదన్నారు. తద్వారా ఇరాన్ నుంచి తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చారు.

.@POTUS on Iran: As somebody said, we could leave today, and it would take 10 years to rebuild the damage that's been done, but I think we have to make it a little bit more permanent so no other president has to go through this. We don't ever want to have that problem again. pic.twitter.com/isqDT7IXcQ
— Rapid Response 47 (@RapidResponse47) March 17, 2026
అలాగే నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇరాన్ వార్ నుంచి నిష్క్రమణ తక్షణమే జరగదని ట్రంప్ స్పష్టం చేశారు. తాము ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా లేమన్నారు. కానీ అతి త్వరలో వెళ్ళిపోతామంటూ మరోసారి గందరగోళం వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘర్షణ దేశీయ ప్రాధాన్యతల నుండి తాత్కాలిక మళ్లింపు మాత్రమేనని ఆయన తెలిపారు. దీనిని ఆయన చిన్న విహారయాత్ర అని పేర్కొంటూ రెండు వారాలు ఉంటుందని, ఎక్కువ కాలం ఉండదని వెల్లడించారు. తద్వారా యుద్ధంపై ఆయన ఎంత గందరగోళంలో ఉన్నారో మరోసారి బయటపెట్టుకున్నారు.
-
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Hormuz Showdown: హార్ముజ్ లోనే తాడోపేడో..! అమెరికా-ఇరాన్ లో గెలిచేదెవరు ? -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ










Click it and Unblock the Notifications