Mojtaba khamenei: రష్యాలో మొజ్తబా ఖమేనీకి ట్రీట్మెంట్ ? తేల్చేసిన ఇరాన్..!
ఫిబ్రవరి 28న ఇరాన్ (iran)సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీపై జరిగిన దాడిలో తృటిలో తప్పించుకున్న ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (mojtaba khamenei)ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. ఆ దాడిలో తీవ్ర గాయాలపాలైన మొజ్తబా రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ ఆహ్వనం మేరకు ఆ దేశానికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారనేది ఈ వార్తల సారాంశం. దీనిపై స్పందించిన ఇరాన్ ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది.
మొజ్తబా ఖమేనీ దాడిలో గాయపడిన తర్వాత ఆయన్ను రష్యాకు చెందిన మిలటరీ విమానంలో అత్యంత గోప్యంగా రష్యాకు తరలించి అక్కడ రహస్య ప్రదేశంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని కువైట్ కు చెందిన ఓ పత్రిక ప్రచురించిన కథనం సంచలనం రేపింది. ఇప్పటికే మొజ్తబా ఆచూకీ లభించకపోవడం, ఆయన ఆచూకీ చెప్తే 93 లక్షల డాలర్లు ఇస్తామంటూ అమెరికా ప్రకటించడం వంటి పరిణామాల మధ్య ఈ కథనానికి ప్రాధాన్యం ఏర్పడింది.

దీనిపై రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ స్పందించారు. ఈ కథనాలను ఆయన ఖండించారు. మొజ్తబా రష్యాలో చికిత్స తీసుకుంటున్నారనేది అవాస్తవం అని తేల్చేసినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది. ఇప్పటివరకూ మొజ్తబా నేరుగా బహిరంగంగా కనిపించకపోయినా ఆయన వెనుక ఉండి యుద్ధానికి సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నట్లు ఇరాన్ చెబుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగిస్తామని, అమెరికా-ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదని ఇప్పటికే మొజ్తబా ఓ సందేశం విడుదల చేశారు.












Click it and Unblock the Notifications