'డాన్సింగ్ మిసైల్' ను ప్రయోగించిన ఇరాన్.. భారీ విధ్వంసం..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 17 రోజులుగా ఒకరిపై మరొకటి భీకర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన 'డాన్సింగ్ మిసైల్' ను ప్రయోగించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఇరాన్ 'డాన్సింగ్ మిసైల్' ను ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళనలో పడింది. సెజిల్ అనే ఈ మిసైల్.. ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణుల్లో ఒకటిగా ఉంది. ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. తాజాగా ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఈ మిసైల్ ను ప్రయోగించిన నేపథ్యంలో ఇది వార్తల్లో నిలిచింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయిన 17 రోజుల తర్వాత ఈ మిసైల్ ను ప్రయోగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

సెజిల్ మిసైల్ ను అషోరా లేదా అషురా మిసైల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఇరాన్ లోనే అత్యాధునిక అడ్వాన్స్ డె మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ గా పేరుగాంచింది. ఈ క్షిపణిని ఇరాన్ లోనే తయారు చేశారు. దేశీయంగా తయారు చేసిన 2 స్టేజీ, సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైల్ ఇది. దీని రేంజ్ దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది సులభంగా ఛేదించగలిగిన సత్తా ఉంది. అలాగే 700 కిలోల సామర్థ్యం వరకు పేలోడ్ ను తీసుకెళ్లగలిగే శక్తి దీని సొంతం.

ఈ మిసైల్ చాలా ఎత్తులోనూ సులభంగా ప్రయాణించగలదు. అందుకే ఈ క్షిపణిని డాన్సింగ్ మిసైల్ అంటారు. ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ ను ఛేదించగలిగిన సత్తా ఈ మిసైల్ కు ఉంది. దాంతో దీనికి ఆ పేరు వచ్చింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సమాచారం ప్రకారం.. ఈ మిసైల్ దాదాపు 18 మీటర్ల పొడవు ఉంటుంది. 1.25 మీటర్ల డయామీటర్ ఉంటుంది. అలాగే 23,600 కిలోమీటర్ల బరువు కలిగి ఉంటుంది.

DancingMissile from Iran Strikes US amp amp Israeli Bases Global Reactions Pour Iran Dancing Missile

ఇక ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం 17 రోజులుగా జరుగుతూనే ఉంది. దాడుల్లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అతని కుటుంబాన్ని ఇజ్రాయెల్, అమెరికా సైన్యం హతమార్చింది. దాంతో ఈ రెండు దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+