Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలా బతికిపోయిన మొజ్తబా ఖమేనీ..! బాంబు దాడిపై షాకింగ్ ఆడియో లీక్..!

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన భీకర మిస్సైల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఆయతుల్లా అలీ ఖమేనీ మృత్యువాత పడ్డారు. ఆయనతో పాటు అదే ఆఫీసులో సమావేశమైన కీలక సైనిక అధికారులు సైతం చనిపోయారు. అయితే అదే భవనంలో ఉన్న సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు మొజ్తబా మాత్రం సంచలన రీతిలో ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ అద్భుత ఘటనకు సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.

కోమాలో ఉన్న ఖమేనీ- ఒక కాలు కూడా తొలగింపు: ది సన్ సంచలన కథనం
కోమాలో ఉన్న ఖమేనీ- ఒక కాలు కూడా తొలగింపు: ది సన్ సంచలన కథనం

ది టెలిగ్రాఫ్ బయటపెట్టిన ఈ ఆడియోలో ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న మొజ్తబా ఖమేనీ (mojtaba Khamenei) ఫిబ్రవరి 28న తన తండ్రి, ఇతర అత్యున్నత సైనికాధికారుల్ని బలి తీసుకున్న భీకర దాడి నుంచి ఎలా తప్పించుకున్నారనేది బయటపెట్టింది. ఇందులో మొజ్తబా ఖమేనీ, పేలుడుకు కొన్ని నిమిషాల ముందు ఓ పని కోసం తన తండ్రి ఆఫీసు ప్రాంగణం బయటకు వెళ్లారు. అప్పుడే ఈ దాడి జరిగిందట. అక్కడే ఉన్న తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు, సైనికాధికారులు మాత్రం బలైపోయారు.

Mojtaba Khamenei s Survival Audio Leak Reveals Escape from Deadly Strike That Killed Father others
ట్రంప్ కు భారత్ బిగ్ షాక్-హార్ముజ్ పై కీలక నిర్ణయం..!
ట్రంప్ కు భారత్ బిగ్ షాక్-హార్ముజ్ పై కీలక నిర్ణయం..!

ఈ దాడికి సంబంధించిన ఇతర భయంకరమైన వివరాలను కూడా ఆ ఆడియో వెల్లడించింది. ఈ దాడిలో ఇరాన్ సైనికాధిపతి కొన్ని కిలోల మాంసపు ముద్దగా మారిపోయారని, అలాగే అయతొల్లా అలీ ఖమేనీ అల్లుడి తల రెండుగా చీలిపోయిందని ఆ ఆడియోలో పేర్కొన్నారు. లీకైన ఈ రికార్డింగ్, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారికి చెందినదిగా భావిస్తున్నారు. అతను మార్చి 12న టెహ్రాన్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. ఖమేనీ కుటుంబాన్ని మరియు ఇరాన్ ఉన్నత నాయకత్వాన్ని ఒకేసారి హతమార్చేందుకు జరిగిన సమన్వయ ప్రయత్నంలో భాగంగా, స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 28న ఉదయం 9:32 గంటలకు ఖమేనీ నివాసంపై దాడి జరిగింది.

Mojtaba Khamenei s Survival Audio Leak Reveals Escape from Deadly Strike That Killed Father others
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??

56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ దాడికి కొద్ది క్షణాల ముందు ఆవరణలోకి అడుగుపెట్టి, భవనంపై దాడి జరిగినప్పుడు తిరిగి మెట్లపైకి వెళుతున్నారని తెలిసింది. ఈ దాడిలో అతని భార్య జహ్రా హద్దాద్-అడెల్, వారి కుమారుడు అక్కడికక్కడే మరణించగా, అతని కాలికి చిన్న గాయం మాత్రమే అయినట్లు సమాచారం. అలీ ఖమేనీ మరో కుమారుడైన ముస్తఫా ఖమేనీ కూడా దాడి జరిగిన సమయంలో సమీపంలోనే ఉన్నారని తేలింది. అయితే తన భార్యతో కలిసి సురక్షితంగా తప్పించుకున్నారని సమాచారం. ఆ దాడి ఎంత శక్తివంతంగా ఉందంటే, ఇరాన్ సైనిక అధిపతి మహమ్మద్ షిరాజీ ముక్కలైపోయారని, ఆయనను గుర్తించడానికి మిగిలింది కొన్ని కిలోల మాంసం మాత్రమేనని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+