వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నులు వేయను కానీ, షరతు: సీఈవోలకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చి, ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాల పైన ప్రత్యేక దృష్టి సారించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాల పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వ్యాపారవేత్తలు, సీఈవోలకు హెచ్చరికలు జారీ చేశారు. దేశం బయట తయారీ పరిశ్రమలు నెలకొల్పితే గణనీయంగా సరిహద్దు పన్ను వేస్తామన్నారు.

అందమైనది.. దాచుకుంటా: ట్రంప్ ఉద్వేగం, నోరు పారేసుకున్నాడుఅందమైనది.. దాచుకుంటా: ట్రంప్ ఉద్వేగం, నోరు పారేసుకున్నాడు

స్థానికంగా వస్తు ఉత్పత్తి చేస్తే కఠిన నిబంధనలు సడలించి, భారీగా పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 12 అత్యుత్తమ సంస్థల అధినేతలతో వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. వారికి ట్రంప్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. అనంతరం వారికి హెచ్చరికలు జారీ చేశారు. తయారీ పరిశ్రమలు ఇప్పుడు అమెరికా బాట పడతాయన్నారు.

donald trump

ఒకవేళ సంస్థలు ఉద్యోగాలను విదేశాలకు మళ్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇతర దేశాల్లో పరిశ్రమలు స్థాపించి, అక్కడి నుంచి ఇక్కడికి ఉత్పత్తులు తీసుకు రావడం జరగని పని అన్నారు. అలా అయితే పెద్ద పన్నులు బాగా వేస్తామన్నారు.

మనం ఏం చేయబోతున్నామో చైనా సహా అనేక దేశాలకు నమ్మశక్యంగా ఉండబోదన్నారు. కొత్త పన్నులేవీ ఉండవని ట్రంప్‌ వ్యాపార వేత్తలకు హామీ ఇచ్చారు. అందుకు వ్యాపారులు చేయాల్సిందల్లా సంస్థలను ఇక్కడి నుంచి తరలించకుండా, అమెరికా ప్రజలను ఉద్యోగాల నుంచి తొలగించడకుండా ఉండడమే అన్నారు.

English summary
America President Donald Trump Focuses on Trade and Jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X