వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Donald Trump : ఎలాన్ మస్క్ పై ట్రంప్ ప్రసంశలు-ట్విట్టర్ లో రీఎంట్రీ-ఎన్నికల వ్యూహాలకు ఊతం..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను అప్పటి యాజమాన్యం నిలిపేసింది. గతేడాది జనవరిలో ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిలిపేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. కానీ తాజాగా కొత్త యజమానిగా ఎంట్రీ ఇచ్చిన ఎలాన్ మస్క్ .. ఓ పోల్ నిర్వహించి అందులో వచ్చిన అభిప్రాయం ఆధారంగా ట్రంప్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ట్రంప్ ఉబ్బితబ్బిబవుతున్నారు.

 ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్

ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్

గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డెమోక్రాట్ల తరఫున తనకు ప్రత్యర్ధిగా నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్రంప్ రెచ్చిపోయేవారు. ట్విట్టర్ యూజర్ పాలసీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారు. అలాగే వీడియోలు కూడా పెట్టేవారు.

వీటిపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆతర్వాత పునరుద్ధరించినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో గతేడాది జనవరిలో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అప్పట్లో ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్ ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు.

ట్రంప్ కు రీ ఎంట్రీ ఇప్పించిన మస్క్

ట్రంప్ కు రీ ఎంట్రీ ఇప్పించిన మస్క్

ట్విట్టర్ కొత్త యజమానిగా ఎంట్రీ ఇచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వచ్చీ రాగానే ద్వేషపూరితమైన కంటెంట్ పై కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. అంతే కాదు గతంలో పాత యాజమాన్యం తీసుకున్నపలు నిర్ణయాలను తిరగతోడటం ప్రారంభించారు. ఇదే క్రమంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పై శాశ్వత సస్పెన్షన్ విధిస్తూ గత యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఆయన కంట్లో పడింది.

దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించారు. అప్పటికే ట్విట్టర్ లో ఉన్న యూజర్లకు ట్రంప్ ఖాతాను పునరుద్ధరిద్దామా వద్దా అని అడిగారు. స్వల్ప తేడాతో ట్రంప్ ఖాతా పునరుద్ధరణకే మిగతా యూజర్లు మొగ్గుచూపారు. దీంతో మస్క్ కూడా ట్రంప్ ఖాతా పునరుద్ధరిస్తామని ప్రకటించారు.

 మస్క్ పై ట్రంప్ ప్రశంసలు

మస్క్ పై ట్రంప్ ప్రశంసలు

తన ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ముఖ్యంగా ట్విట్టర్ ను మస్క్ కొనుగోలుచేయడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపైనా ట్రంప్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో మస్క్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నట్లు ట్రంప్ తెలిపారు.

అయితే ప్రస్తుత సంక్షోభాల్ని తట్టుకుంటూ మస్క్ ట్విట్టర్ ను ఎలా ముందుకు తీసుకెళ్తాడన్న దానిపై సందేహాలు వ్యక్తంచేశారు. అతనో క్యారెక్టర్ అని, తాను క్యారెక్టర్ ఉన్నవారిని ఇష్టపడతానని ట్రంప్ చెప్పుకొచ్చారు. తద్వారా తనకు ట్విట్టర్ లో పునర్జన్మ ఇచ్చిన మస్క్ పై అభిమానాన్ని ట్రంప్ అలా బయటపెట్టుకున్నారు.

 ట్రంప్ అధ్యక్ష ఎన్నికల వ్యూహాలకు కీలకం?

ట్రంప్ అధ్యక్ష ఎన్నికల వ్యూహాలకు కీలకం?

ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేసిన సమయంలో ఆయన వ్యవహారశైలి ఎవరికీ నచ్చలేదు. కానీ గత కొంతకాలంగా మౌనంగా ఉంటూనే తన వ్యూహాలు తాను అమలు చేస్తున్న ట్రంప్... తాజాగా రిపబ్లికన్ల తరఫున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ అధినేతగా మారిన మస్క్ ను కూడా ప్రసన్నం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలంటే సోషల్ మీడియా పరంగా కూడా బలంగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు.

అందుకే ట్విట్టర్ కు పోటీగా తాను ప్రారంభించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కంటే ట్విట్టర్ ద్వారానే తనకు ఎక్కువగా ప్రచారం లభిస్తుందని అంచనా వేసుకుంటున్నారు. గతంలో అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ట్విట్టర్ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇదంతా తెలిసిన ట్రంప్ మరోసారి తన వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు అర్ధమవుతోంది.

English summary
former us president donald trump on today praises twitter owner elon musk for reinstation of his account after a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X