భారత్‌తో బడా వాణిజ్య డీల్.. హింట్ ఇచ్చిన ట్రంప్
Donald Trump: భారత్‌తో త్వరలో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలలో గణనీయమైన పురోగతి ఉందని ట్రంప్ అన్నారు. తాము కొన్ని కీలక ఒప్పందాలను చేసుకుంటున్నామని.. అందులో భారత్‌తో కూడా ఒకటి రాబోతోందని వెల్లడించారు. ఆ వాణిజ్య ఒప్పందం చాలా పెద్దదని ట్రంప్ పేర్కొన్నారు. దాని ద్వారా భారత్‌లో అవకాశాలను విస్తరిస్తామని.. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన "బిగ్ బ్యూటిఫుల్ బిల్" కార్యక్రమంలో అన్నారు. అమెరికా చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని.. దాని కోసం సంతకాలు జరిగాయని ట్రంప్ తెలిపారు. అయితే, చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను ఆయన వెల్లడించలేదు.
"ప్రతి ఒక్కరూ మాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని.. దానిలో భాగం కావడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని నెలల క్రితం.. మీతో ఒప్పందం చేసుకోవడానికి ఎవరైనా ఆసక్తి చూపుతున్నారా? అని ఓ మీడియా అడిగింది. ఆ విషయంపై ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం. నిన్ననే చైనాతో వాణిజ్యం ఒప్పందంపై సంతకం చేశాం. కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. త్వరలోనే భారత్‌తో బిగ్ ట్రేడ్ డీల్ జరగొచ్చు." అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాల గురించి ట్రంప్ వెల్లడించలేదు. అయితే తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. భారత అధికారి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం గురువారం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌కు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి.

ఒప్పందం ముగింపు దిశగా చర్చలు
రెండు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం చర్చలలో నిమగ్నమై ఉన్నాయి మరియు జూలై 9 లోపు ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 2న అమెరికా ప్రకటించిన అధిక సుంకాలకు ట్రంప్ సర్కారు జూలై 9 వరకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. సుంకాల నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు భారత్ దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకునే అంగీకారం లభించినట్లు తెలుస్తోంది. అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ - ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి, ఆపిల్, చెట్టు కాయలు, జన్యు మార్పిడి చేసిన పంటలు వంటి వ్యవసాయ వస్తువులపై సుంకాల రాయితీలు కోరుతోంది.భారతదేశం ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో వస్త్రాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, వస్త్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష , అరటిపండ్లు వంటి శ్రమ-ఆధారిత రంగాలకు సుంకాల రాయితీలు కోరుతోంది.
#WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44
— ANI (@ANI) June 26, 2025












Click it and Unblock the Notifications