వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు పేల్చిన ట్రంప్ పెద్ద కొడుకు! ‘అవును, వికీలీక్స్‌తో ‘టచ్’‌లో ఉన్నా..’, చాటింగ్ బహిర్గతం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందని అమెరికా నిఘా వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రమేయంపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందని అమెరికా నిఘా వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రమేయంపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే.. ఎలక్షన్ల తెరవెనుక జరిగిన రహస్యాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తాజాగా ట్రంప్ పెద్ద కొడుకు తనకు, వికీలీక్స్ కు మధ్య జరిగిన చాటింగ్ ను బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికలకు ముందు ఈమెయిల్స్ హ్యాంకింగ్‌తో హిల్లరీ క్లింటన్ విజయావకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వీకీలీక్స్ వరుస లీకులు.. హిల్లరీ ఓటమికి దోహదం చేశాయి.

కలకలం రేపిన ట్రంప్ పెద్దకొడుకు ట్వీట్...

కలకలం రేపిన ట్రంప్ పెద్దకొడుకు ట్వీట్...

తాజాగా ట్రంప్ పెద్దకుమారుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ చేసిన ఓ ట్వీట్ అమెరికాలో కలకలం రేపింది. వికీలీక్స్‌కు తనకు మధ్య జరిగిన ట్విటర్ సంభాషణను ఆయన పోస్ట్ చేశారు. 2016 సెప్టెంబర్ 9న వికీలీక్స్.. జూనియర్ ట్రంప్‌కు ఓ మెసేజ్ పెట్టింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిచే ఓ వెబ్‌సైట్ గురించి అందులో సమాచారం ఇచ్చింది.

తెలియదు.. తెలుసుకుంటాను.. థాంక్యూ..

తెలియదు.. తెలుసుకుంటాను.. థాంక్యూ..

ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘పుతిన్‌ట్రంప్.ఓఆర్‌జీ' అనే వెబ్‌సైట్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తోందంటూ.. దీని వెనక ఉన్నది ఎవరో తెలుసా? అని అడుగుతూ దాని పాస్‌వర్డ్‌తో సహా వికీలిక్స్.. ట్రంప్ పెద్ద కుమారుడికి ఓ మెసేజ్ పెట్టింది. దానికి.. ‘దీని వెనక ఉన్నది ఎవరో నాకుతెలియదు. దీని సంగతి ఆరా తీస్తాను. థ్యాంక్యూ..' అని జూనియర్ ట్రంప్ రిప్లై కూడా ఇచ్చారు.

వికీలీక్స్ తో ‘టచ్’ లో ఉంటూ...

వికీలీక్స్ తో ‘టచ్’ లో ఉంటూ...

ఆ తర్వాత కూడా హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా పలు ఆర్టికల్స్‌ లింక్స్ ఇస్తూ, దీని గురించి ప్రచారంలో మాట్లాడండంటూ వికీలీక్స్.. జూనియర్ ట్రంప్‌కు మెసేజ్‌లు పంపింది. ఓ తరుణంలో ట్రంప్ ఆదాయ వివరాలు ఇస్తే.. హిల్లరీకి గట్టి సమాధానం చెప్పొచ్చని కూడా సూచించింది. ఇలా అక్టోబర్ నెల వరకు తనకు, వికీలీక్స్‌కు మధ్య జరిగిన చాటింగ్‌ను జూనియర్ ట్రంప్ బహిర్గతం చేశారు. తాను కొన్ని మెసేజ్‌లకు మాత్రమే బదులిచ్చానని చెప్పుకొచ్చారు.

ది అట్లింటిక్ లో ముందే కథనం...

ది అట్లింటిక్ లో ముందే కథనం...

అయితే అంతకుముందే.. రష్యా, వికీలీక్స్ సంయుక్తంగా జూనియర్ ట్రంప్ సహకారంతో హిల్లరీ గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా హ్యాంకింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ‘ది అట్లాంటిక్' అనే వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రచురితమైన కొద్ది గంటల్లోనే జూనియర్ ట్రంప్.. ట్విటర్లో తనకు, వికీలీక్స్‌కు మధ్య జరిగిన సంభాషణను తన ట్విట్టర్ ఖాతా ద్వారా బహిర్గతం చేశారు..

వికీలీక్స్ అధినేతకు దౌత్యవేత్త పదవి ఇవ్వాలంటూ...

వికీలీక్స్ అధినేతకు దౌత్యవేత్త పదవి ఇవ్వాలంటూ...

గతేడాది సెప్టెంబర్ 9 నుంచి ఈ ఏడాది జూలై వరకు.. జూనియర్ ట్రంప్‌కు, వికీలీక్స్‌కు మధ్య చర్చలు జరిగాయనీ, వికీలీక్స్ అధినేతను ఆస్ట్రేలియాకు అమెరికా దౌత్యవేత్తగా నియమించాలంటూ ప్రతిపాదనలు కూడా వచ్చాయని ‘ద అట్లాంటిక్' ప్రచురించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా జూనియర్ ట్రంప్‌కు వికీలీక్స్ నుంచి మెసేజ్‌లు వచ్చాయని స్పష్టం చేసింది. రష్యా, వికీలీక్స్ సహకారంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందన్న కొందరి వాదనకు ‘ద అట్లాంటిక్' కథనం బలం చేకూరుస్తోంది.

English summary
Donald Trump Jr, the eldest son of the US president, was in direct communication with WikiLeaks in the crucial final stages of the 2016 presidential election, a new leak of private correspondence from inside the Trump circle reveals. The younger Trump exchanged direct messages with the WikiLeaks account on Twitter between 20 September and 12 October 2016. Copies of the correspondence were handed to congressional investigators by Trump Jr’s lawyers and subsequently obtained by the Atlantic magazine.The communication occurred at a highly sensitive moment for both the Trump presidential campaign and for WikiLeaks, just weeks before election day and at the height of WikiLeaks’ publication of hacked emails belonging to senior Democratic figures at the instigation, US intelligence agencies allege, of the Russian government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X