వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవన్నీ పిచ్చి రాతలే: రష్యా వద్ద తన రహస్యాలపై ట్రంప్ ఫైర్

తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం రష్యా వద్ద ఉందంటూ వచ్చిన మీడియా కథనాలపై తదుపరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం రష్యా వద్ద ఉందంటూ వచ్చిన మీడియా కథనాలపై తదుపరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'అదంతా కట్టుకథ. నాపై ఆరోపణలు అవమానకరం. మానసిక రోగులు, నా వ్యతిరేకులు కలిసి చేసిన పని' అని విమర్శించారు.

తనపై ఆరోపణలను అమెరికా నిఘా సంస్థలు మీడియాకు లీక్ చేసి ఉండొచ్చని, అదే నిజమైతే వాటి చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. 9రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ ఆరు నెలల విరామం తర్వాత తొలిసారి బుధవారం కుటుంబసభ్యుల సమక్షంలో కిక్కిరిసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
'నాపై వచ్చిన సమాచారాన్ని చదివా.. అవన్నీ పిచ్చి రాతలు.. పశ్చి అబద్ధాలు' అని ట్రంప్ అన్నారు.

Donald Trump lashes out at media and intelligence agencies over Russia claims

కాగా, రష్యా నుంచి తమకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమేనని డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా అంగీకరించారు. అమెరికాపై రష్యా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని తొలిసారిగా ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. చైనా వంటి ఇతర దేశాలూ తమపై హ్యాకింగ్‌కు తెగబడుతున్నాయని ఆరోపించారు. అయితే, హ్యాకింగ్‌ నిరోధానికి పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటుచేసుకోకపోవడం అమెరికా తప్పేనన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 90 రోజుల్లో హ్యాకింగ్‌ రక్షణ వ్యవస్థపై సరికొత్త నివేదికను అందజేస్తానన్నారు.

తన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలకు అమెరికా నిఘాసంస్థలు విడుదల చేసిన నివేదికలే కారణం కావొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అదే వాస్తవమైతే నిఘాసంస్థలకు పెద్ద కళంకంగా మిగిలిపోతుందన్నారు. తనకు రష్యాలో ఎలాంటి వ్యాపారాలు, రుణాలు, అపరిష్కృత ఒప్పందాలు లేవన్నారు. ఒకవేళ పుతిన్‌ తనను ఇష్టపడుతుంటే దాన్ని ఆస్తిగా భావిస్తాను కానీ రుణంగా కాదని వ్యాఖ్యానించారు.

కాగా, వ్యాపార సామ్రాజ్యాన్ని తన ఇద్దరు కుమారులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌లకు పూర్తిగా అప్పగిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసినట్టు చెప్పారు. వ్యాపార నిర్వహణ గురించి వారు ఇకపై తనతో చర్చించబోరని కూడా స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆస్తులను ట్రస్టు పేరిట బదిలీ చేస్తారని ఈ సందర్భంగా ఆయన న్యాయవాది షేరీ డిల్లాన్‌ తెలిపారు. ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలేవీ విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవని కూడా ఆమె చెప్పారు.

ఒబామా కేర్‌ పథకాన్ని తొలగించి మరింత సమర్థవంత, చవకైన ఆరోగ్య పథకం ప్రణాళికను విడుదల చేస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు సృష్టించడంలో ప్రపంచంలో తనను మించేవారు ఎవరూ ఉండరని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పానని.. దాని కోసం శ్రమిస్తున్నానని అన్నారు.

అంతేగాక, అక్రమ వలసలను అరికట్టటానికి మెక్సికో సరిహద్దు వెంట త్వరలోనే గోడ కడతామని ట్రంప్‌ తెలిపారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చును మెక్సికో నుంచి రాబడతామన్నారు. అమెరికా కార్మికులను తొలగించి, ఇతర దేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్న కంపెనీలపై భారీ సరిహద్దు పన్నును విధిస్తామని స్పష్టం చేశారు.

English summary
Donald Trump unleashed a firestorm of invective against “shameful” news outlets and the “disgraceful” behavior of the intelligence agencies, in a feisty press conference as he attempted to demolish salacious allegations concerning his dealings in Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X