మధ్యంతర ఎన్నికలు: సంచలన నిర్ణయం దిశగా ట్రంప్?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ ట్రంప్ చేసిన ట్వీట్లను బట్టి రాజకీయ పరిశీలకులు అంచనాకు వచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలతో వివాదాలను కొని తెచ్చుకొంటున్నారు. అంతేకాదు సంచలన నిర్ణయాలు తీసుకొంటూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Donald Trump Looks To US Midterm Elections In Year-End Tweets

2018 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ట్రంప్ చేసిన ట్వీట్లు మధ్యంతర ఎన్నికలకు ట్రంప్ సిద్దమౌతున్నారా అనే సంకేతాలను ఇస్తున్నాయి అంతేకాదు కొత్త సంవత్సరంలో యూఎస్ కాంగ్రెస్‌ను ట్రంప్ తన నియంత్రణలోకి తెచ్చుకొనేలా ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ పన్ను వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తీరును ప్రస్తావించిన ఆయన, అమెరికన్లు స్మార్ట్ ఓటర్లని, 2018లో వారు డెమోక్రాట్లను ఎందుకు ఎంచుకుంటారని ప్రశ్నించారు.డెమోక్రాట్ల విధానాలు, అమెరికా గొప్ప చరిత్రను, సంస్కృతిని, సంపదను హరించి వేసేలా ఉన్నాయని ఆరోపించారు.

ఐఎస్ఐఎస్, వీఏ, జడ్జస్, స్ట్రాంగ్ బార్డర్, సెకండ్ ఏ తదితర పదాలను పలికేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదని అన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్లను బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump tweeted right to the end of 2017 Sunday, boasting of his accomplishments in his turbulent first year in office and throwing down the gauntlet for the US midterm elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి