మోడీపై ట్రంప్ ప్రశంసలు! భారత్‌లో వ్యాపారానికి ట్రంప్ వారసుల ఆసక్తి
ముంబై : భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని పనితీరును మెచ్చుకున్న ట్రంప్.. భవిష్యత్తులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్ లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్టున్నట్టుగా ట్రంప్ వ్యాపార భాగస్వామి పంచశిల్ రియాలిటీ డైరెక్టర్ సాగర్ చోర్దియా తెలిపారు.
మంగళవారం నాడు భారత్ లోని తన వ్యాపార భాగస్వాములతో నిర్వహించిన సమావేశంలో సాగర్ చోర్దియాతో పాటు అతుల్ చోర్దియా, కాల్పేశ్ మెహతా పాల్గొన్నారు. ట్రంప్ టవర్ లో జరిగిన ఈ సమావేశంలో.. మోడీ గురించి ట్రంప్ ప్రస్తావించినట్టుగా సాగర్ చోర్దియా చెప్పారు. 'ట్రంప్ మోడీని పొగుడుతుంటారు.. మోడీ పనితీరు గొప్పగా ఉంటుందని చెబుతుంటారు' అని సమావేశానంతరం సాగర్ చోర్దియా పేర్కొన్నారు.

భవిష్యత్తులో భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడుతాయన్న నమ్మకం తనకు బలంగా ఉందని సాగర్ చోర్దియా అభిప్రాయపడ్డారు. మంగళవారం నాటి సమావేశంలో భారత్ కు చెందిన వ్యాపారులతో పాటు ట్రంప్ వారసులు ఇవాంకా, ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా పాల్గొన్నారు.
కాగా, ప్రస్తుతం ట్రంప్ వ్యాపారానికి సంబంధించి ఐదు లగ్జరీ ప్రాజెక్టుల పనులు భారత్ లో జరుగుతున్నాయి. ఇందులో ట్రంప్ టవర్ ఒకటి కాగా.. పుణెలోని పంచశిల రియాలిటీ సంస్థతో కలిసి 46 అంతస్తులో దీన్ని నిర్మిస్తున్నారు. మరో 300 అపార్ట్ మెంట్లు ముంబైలో నిర్మాణంలో ఉన్నాయి. భారత్‌లో వ్యాపారానికి ట్రంప్ వారసులు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సాగర్ చోర్దియా చెప్పారు.












Click it and Unblock the Notifications