వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో కలకలం, వేదిక నుంచి దించేసిన అధికారులు, ట్రంప్ ఆవేశం!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: నెవడాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ట్రంప్ ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఆయనకు రక్షణగా నిలిచి, హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నెవడాలో జరిగిన ప్రచారంలో అలజడి రేగింది. ట్రంప్ ప్రచారకార్యక్రమంలో ఓ వ్యక్తి తుపాకితో ప్రవేశించాడనే వైట్‌హౌస్ రహస్య భద్రతా సిబ్బంది హెచ్చరికలు అంతా ప్రకంపనలు సృష్టించాయి.

సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ట్రంప్‌ను వేదికపై నుంచి అత్యంత భద్రత మధ్య కిందికి తీసుకెళ్లారు. కొద్దిసేపు సభా ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. ఎవరిదగ్గరా తుపాకీ లేదని నిర్ధారించిన అనంతరం ట్రంప్‌ని మరలా వేదిక పైకి తీసుకొచ్చారు.

Donald Trump Rushed Offstage by Secret Service Agents

అనంతరం ట్రంప్ మాట్లాడారు. మనల్ని ఎవరూ, ఎప్పడూ ఆపలేరని ఆవేశంగా ప్రసంగించారు. రహస్య భద్రతా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, వారి కృషిని ప్రశంసిస్తున్నట్లు చెప్పారు.

అసలేం జరిగింది?

ట్రంప్ సభా వేదిక పైకి వస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ట్రంప్ పైకి దూసుకురావడాన్ని భద్రతాధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షణాల్లో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్‌ని అక్కడ నుంచి దూరంలో తీసుకెళ్లారు. అనుమానితుల విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తులను వదిలేయగా మరోవ్యక్తిని అదుపులోనే ఉంచారు. మూడో వ్యక్తి వ్యూహాత్మకంగా వేషధారణ చేసుకోవడం పలు అనుమానాలకు దారితీయడంతో పోలీసుల విచారణ జరుపుతున్నారు.

English summary
Donald Trump is rushed off stage by Secret Service agents at rally in Nevada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X