ట్రంప్‌కి పోర్న్ స్టార్‌తో సంబంధం నిజమే, లక్ష డాలర్లు చెల్లించారు: అటార్నీ సంచలనం

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ గతంలో ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం కొనసాగించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. అయితే, ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది.

 ఆ బంధం నిజమే

ఆ బంధం నిజమే

తాజాగా, ట్రంప్‌పై వచ్చిన ఆ ఆరోపణల్లో నిజముందని ఆయన వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ చెప్పడం ఇప్పుడు మరోసారి సంచలనానికి తెరతీసింది. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

 గోప్యత కోస భారీగా చెల్లించారు

గోప్యత కోస భారీగా చెల్లించారు

‘పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌తో ట్రంప్ 1,30,000డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమే' అని మైకేల్ తెలిపారు. అయితే, స్టోర్మీతో చేసుకున్న ట్రంప్ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురిచేసేందుకు ఉద్దేశించింది కాదని అన్నారు.

 విమర్శలు రాకుండానే..

విమర్శలు రాకుండానే..

రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుందని చెప్పారు. పైగా ఇది న్యాయబద్ధమైందని కోహెన్ తెలిపారు. ఇంతకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించవచ్చని చెప్పడం గమనార్హం.

 ఇవాంకలా అందంగా అంటూ..

ఇవాంకలా అందంగా అంటూ..

కాగా, ఇన్‌ టచ్‌ అనే మాగ్జైన్‌‌లో స్టోర్మీ డేనియల్స్‌(స్టెఫానీ క్లిఫార్డ్‌) ఇంటర్వ్యూను ప్రచురించగా.. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దానిని యథాతథంగా ప్రచురించింది. అందులో మెలానియా(ట్రంప్‌ భార్య) బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్‌ పెట్టుకున్నట్టు ధృవీకరించింది. కొంతకాలమే కొనసాగిన తమ బం‍ధం సరదాగా సాగిపోయిందని చెప్పారు. అంతేగాక, తన కూతురు ఇవాంక తరహాలో అందంగా, స్మార్ట్‌గా ఉంటానంటూ ట్రంప్‌ తరచూ తనతో చెబుతుండేవాడని స్టోర్మీ తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump’s personal attorney Michael Cohen said that he paid $130,000 to an adult film actor who an extramarital affair with Trump in 2006.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి